పథకాలు సరే! కొనుగోలు శక్తి పెంచేదెప్పుడు?

Schemes OK! When does purchasing power increase?అందరికీ సుపరిచితమైన నాటి కిలో రెండు రూపాయల బియ్యం, నేటి ఒక రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయం బర్స్‌మెంట్‌, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు జీవనభృతి, రైతుబంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ.2500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ల్యాడ్లీ బహన్‌, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఉచిత విద్యుత్‌, గృహ విని యోగానికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ వంటి అనేక జనాకర్షణ పథకాలను రాజకీయ పార్టీలు ఎన్నికలలో వాగ్దా నం చేస్తున్నది. ప్రజలు విశ్వసించి ఓట్లు వేసిన పార్టీ అధికా రంలోకి వస్తున్నది. కొన్ని వాగ్దానాలు అమలు చేయడం కొన్ని విస్మరిస్తున్నది. ఈ పథకాలతో లాభ పడుతున్నది పేద వర్గా లుగా కనబడుతున్నప్పటికీ పరోక్షంగా లాభపడుతున్నది ధనిక వర్గాలే. సంక్షేమ పథకాలు ప్రజా తిరుగుబాట్లు రాకుండా ఉప యోగపడటమే కాదు, పాలకవర్గ బూర్జువా, భూస్వామ్య పార్టీ లు ఓట్లు, సీట్లు పొందడానికి, పెట్టుబడిదారీ వర్గాలు తమ దోపిడీని తీవ్రం చేయడానికి ఉపయోగ పడుతున్నాయి. ఉచితాలు అనుచితం అంటూ, పప్పు బెల్లంలా పంచి పెడుతున్నారంటూ దోపిడీ వర్గాలే గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న పన్నులు, రాయితీల రాబడిలో ఎనభై శాతం సామాన్యులదే.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాల వలన కార్పోరేట్‌ హాస్పిటల్స్‌, ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలు లబ్ధిపొందాయి. ప్రభు త్వాలు చెల్లింపులను బకాయిలు పెడితే సేవలు నిలిపివేస్తున్నారు. ఇవే డబ్బు లతో ప్రభుత్వమే నాణ్యమైన, ప్రామాణికమైన విద్యా, వైద్య సౌకర్యాలు ప్రజలకు కల్పించవచ్చును. అందులో పని చేసే డాక్టర్లకు, ఫ్యాకల్టీకి, సిబ్బందికి మంచి వేతనాలు, సౌకర్యాలు కల్పించవచ్చును. ఈ పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదు? ఆలోచిస్తే సమాధానం తేలికే. కార్పొరేట్ల ప్రయోజనం కోసమేనన్నది వాస్తవం. రేషన్‌ బియ్యం మనిషి ఆహారానికి కొంతమేరకు ఉపయోగపడుతుంది. అదే సమ యంలో తక్కువ జీతానికి, కూలికి మనుషులు దొరకడానికి పరోక్షంగా ప్రయోజనం చేకూర్చుతున్నది. ఈ స్కీం లేకుంటే పరిశ్రమల యజ మానులు, భూస్వాములు, వ్యాపార, వాణిజ్య వర్గాలు రోజుకు రూ.50 పైనే అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఉచిత బస్సు సౌకర్యం మహిళల సాధికారతకు దోహదం చేసేదే. దీనివల్ల శ్రామిక మహి ళలకు నెలకు రూ.300 నుండి 600 వరకు పొదుపు అవుతున్నాయి. కానీ మున్ముందు యజమానులు చెల్లించే వేతనాల్లో దీన్ని గమనంలో ఉంచుకునే వారి జీతాలు నిర్ణయించే అవకాశాలున్నాయి.
వ్యవసాయంలో వ్యయం, ఇతరులకు సాయం తప్ప రైతులకు ఆదాయం లేక ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, యంత్రాలు వంటి ఇన్‌పుట్స్‌ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ఈ పథకాలు వచ్చాయి. రైతుల చేతిలో వ్యవసాయం ఉన్నం తవరకు వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించాలి. ఇది పరిశ్రమల, వ్యాపార, వాణిజ్య అధిపతుల పాలసీ. ఆహార ఉత్ప త్తుల ధరలు తక్కువగా ఉంటేనే తమవద్ద పనిచేసే ఉద్యోగ, కార్మికులకు తక్కువ జీతాలు ఇవ్వడానికి ఉం టుంది. తమ పరిశ్రమలకు రా మెటీరియల్‌గా ఉపయో గపడే పత్తి, చెరుకు, రబ్బర్‌ వంటి ఉత్పత్తులను తక్కువ ధరకు రైతుల నుండి పొంది, తమ ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రైతుల ఆదాయం పెంచే విధంగా ఉండాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. దళిత బంధు పథకం లబ్ధిదారులు తమ తమ ఆసక్తిగల ఉత్పత్తి యూనిట్లను, వ్యాపార, వాణిజ్య రంగాల పెట్టుబడి పెట్టి స్వయం ఉపాధి పొందే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. మార్కెటింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగింది. ఆధిపత్య భావజాలంగల సమాజంలో స్కీమ్‌పై వ్యతిరేక ప్రచారం నిర్వహించడంలో పాలకవర్గాలు జయప్రదమ య్యాయి. ఆసరా పెన్షన్‌లు పొందేవారిలో వికలాంగులు, వితంతు వులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత వృత్తుల వంటి వారు ఉన్నప్ప టికీ ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారే అధిక భాగంగా ఉన్నారు. పనిచేసే వయస్సులో వీరంతా రకరకాల ఉత్పత్తుల్లో పాల్గొ న్నారు. అయినా సరే తమ జీవిత చరమాంకంలో వినియోగించు కునేందుకు ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోయారు. వారి శ్రమకు తగిన ఫలితం దక్కకపోవడమే దీనికి కారణం. పిల్లలు వారి వద్ధ తల్లి దండ్రులను పోషించుకోలేకపోతున్నారు. వీరు కూడా తమ శ్రమకు తగిన ప్రతిఫలం పొందడం లేదు. కన్నవారు పరాయివారుగా పాలకు లను పెద్దకొడుకుగా, కన్నవారి కంటే ఎక్కువగా ప్రచారం చేసుకుంటు న్నారు. శ్రమకు తగిన ఫలితం కాదు కదా కనీస వేతనం కూడా నిర్ణ యించి అమలు చేయకుండా దోపిడీ వర్గాల ప్రయోజనాలను బూర్జువా రాజకీయ పార్టీలు కాపాడుతున్నాయి.
రాష్ట్రంలో కోటి మంది శ్రామికులకు ప్రయోజనం కల్పించే 73 షెడ్యూల్‌ పరిశ్రమల కనీస వేతనం జీవోలను గత పదిహేనేండ్లుగా సవరించ లేదు. కనీస వేతనం నెలకు రూ.26వేలు ఇవ్వాల్సిి ఉండగా సగటున 12 గంటలకు పని చేయించుకొని రూ.8 వేల నుండి 12వేలు మాత్రమే ఇస్తున్నారు. కనీస వేతనాల సలహా బోర్డు సూచన మేరకు కార్మిక శాఖ నెలకు రూ.18 వేల కనీస వేతనంతో కూడిన జీవోలను ఐదు రంగాలలో ఇచ్చినప్పటికీ, ఫైనల్‌ గెజిట్‌ ఇవ్వకుండా రెండేండ్లకు పైగా ముఖ్యమంత్రి కార్యాలయం నిలిపివేసింది. పది మంది మ్యాన్‌పవర్‌తో పనిచేస్తున్న వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు వారి ప్రోడక్ట్‌, సర్వీస్‌లలో ఉపయోగిస్తున్న సాంకేతిక, పని సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.2 లక్షల నుండి 10 లక్షల లాభం పొంద గలుగుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ప్రజల ఆదా యం పెరిగేందుకు తోడ్పడే కనీస వేతనాలు పెంపు జీవోలను ప్రభు త్వాలు ఎందుకు విడుదల చేయడం లేదు. పైగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధికి, అవసర మైన ప్రజానీకానికి సంక్షేమ పథకాలు చేపట్టడానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
స్వాతంత్య్ర తొలినాళ్లలో స్వయం సమృద్ధి దిశగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు నెల కొల్పడం, ఉన్నత సాంకే తిక విద్య, రీసెర్చ్‌ కేంద్రాలు వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం పెట్టు బడులు పెట్టింది. నీటి పారుదల ప్రాజెక్టుల వలన లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఆహారం ఉత్పత్తుల్లో స్వయం సమద్ధి సాధిం చాము. ప్రజల ఆదాయం కొనుగోలు శక్తి పెరిగింది. హైదరాబాద్‌ కేంద్రంగా నిర్మించబడిన బీహెచ్‌ఈఎల్‌, ఐసిఇఎల్‌, బిడిఎల్‌, బిఈఎల్‌, మిధాని, ఐడిపిఎల్‌, హెచ్‌ఎంటి, ఆల్విన్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, వాటికి అనుబంధంగా నిర్మించబడిన అనేక చిన్న పరిశ్రమలతో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలు లభించాయి. మరోవైపు సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్‌ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిం చబడింది. ప్రభుత్వరంగ సంస్థల ఉద్దేశం ఎక్కువ మందికి మంచి వేతనంతో కూడిన ఉపాధి కల్పించడం. వాటి ఉత్పత్తులను, సేవలను ప్రజలకు తక్కువ ధరలకే అందించడం లక్ష్యంగా ఉండేది. గత రెండు దశాబ్దాల కాలంగా పరిస్థితి తిరగబడింది. ఈ సంస్థలలో పర్మినెంట్‌ ఉద్యోగిత తగ్గించారు. ఉత్పత్తి టార్గెట్లు పెంచారు. అరకొర వేతనా లతో కూడిన కాంట్రాక్టు కార్మికుల సంఖ్య అమాంతంగా పెంచేశారు. సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సాప్ట్‌వేర్‌ రంగంలో కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు 30 శాతానికి చేరుకున్నాయని ఒక అంచనా. వీరు అసలు వేతనాల్లో 40 శాతం మాత్రమే పొందు తున్నారు. సాప్ట్‌వేర్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఒక రాష్ట్రానికే పరిమితమైనవి కావు. దేశంలోని అనేక రాష్ట్రాల వాళ్లు ఉపాధి పొందుతున్నారు. దీనికి తోడు అనేక రంగాల్లోకి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టబడ్డారు.
తెలంగాణలో వివిధ రంగాల్లో సుమారు 20 లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. వీరిలో 70 శాతం మంది యువకులు పెండ్లి కాని వారు. రోజుకు 12 గంటలు పనిచేస్తూ సగటున నెలకు రూ.12 వేల జీతం పొందుతున్నారు. రూ.రెండు వేలు లేదా మూడు వేలు ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. మిగతావి తమ స్వగ్రామాల్లోని కుటుంబాలకు పంపిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రజల ఆదాయం కొనుగోలు శక్తి పడిపోయింది. ఆదాయమంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంగా మార్చేశారు. తెలంగాణ తల సరి ఆదాయం రూ.3 లక్షల 10 వేలుగా చెప్పబడుతున్నది. ఒక కుటుంబం ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు అంటే ఏడాదికి రూ.12 లక్షల 40 వేలు. ఎన్ని కుటుంబాలు ఈ ఆదాయాన్ని పొందగలు గుతున్నాయి. శ్రామికుల శ్రమతో సృష్టించబడుతున్న సంపద పెట్టు బడిదారుల వద్ద పోగుపడుతున్నది. ఇది పంచబడాలి. అప్పుడు ప్రజ ల ఆదాయం, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. అప్పుడు మరిన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేయగలం.
గీట్ల ముకుందరెడ్డి
94900 98857