5 శతాబ్దాల భారతీయుల స్వప్నం నెరవేరిన వేళ..

నవతెలంగాణ – గోవిందరావుపేట
అయోధ్య రామ మందిర భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని దుంపలగూడెం గ్రామంలోని రామాలయంలో సోమవారం శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరాముని శోభయాత్ర నిర్వహించి రామాలయంలో గ్రామ ప్రజలు శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఒక్కరు రామనామ స్మరణం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం బుబ్బా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఐ ఎన్ టీ యు సీ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ భూక్య వాణి – రాజు, ఉప సర్పంచ్ కట్ల జనార్ధన్ రెడ్డి , సూది రెడ్డి జనార్ధన్ రెడ్డి  , సామ చిట్టీ బాబు , బొల్లు కుమార్ , మధు సుదన్, బోల్లు యకాంబరం, ఎర్రబోయిన కుమారస్వామి, బానోత్ రాజు, లావుడ్య రాజు, దోనికల రాఘవులు,కందుల బాబు, బొల్లు వెంకన్న, బోల్లు లింగన్న , నన్నెబోయిన సమ్మయ, సాయి, లింగంపెల్లి యాదయ్య , మార్కు సతీష్ ముత్తయ్య, తుక్కాని మధు, మహిళలు జామున, సరిత మరియు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.