ఆ రైలు ఎప్పుడు వస్తుందో…!?

When will that train come...!?– సమయపాలన పాటించని రైల్వేలు
న్యూఢిల్లీ : అది ఓ రైల్వే స్టేషన్‌. రైలు బండి వచ్చి స్టేషన్‌లో ఆగింది. నిర్దేశిత సమయానికే రైలు వచ్చిందని అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయారు. ఇంతలో ఓ వ్యక్తి చావుకబురు చల్లగా చెప్పాడు. అది అంతకుముందు రోజు అదే సమయానికి రావాల్సిన రైలు అట. అంటే రైలు 24 గంటల ఆలస్యంగా నడుస్తోందన్న మాట. ఇదంతా చూస్తూ రైలు రాకడ…ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అని నిట్టూర్చాడో ప్రయాణికుడు.
రైళ్ల రాకపోకలపై చాలా కాలం నుండి ప్రాచుర్య ంలో ఉన్న జోక్‌ ఇది. నిజం చెప్పాలంటే రైల్వే శాఖలో సమయపాలన అనేది మచ్చుకైనా కానరావడం లేదు. ఓ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో ఆగస్ట్‌ రెండో పక్షం నాటికి మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సమయపాలన ఏకంగా 73% తగ్గిందట. గత సంవత్సరం ఇదే కాలంలో రైళ్ల రాకపోకలలో సమయపాలన కేవలం 11% మాత్రమే తగ్గిపోయి ంది. ఇక సరకు రవాణా రైళ్ల వేగం గంటకు 27.5 కిలోమీటర్లకు పడిపోయింది.
గత సంవత్సరంలో ఈ వేగం 32.4 కిలోమీటర్లుగా ఉంది. అయితే రైళ్ల ద్వారా రవాణా అవుతున్న సరకు 1% పెరిగి 558 మిలియన్‌ టన్నులకు చేరింది. రైలు పట్టాల నిర్వ హణ, మెయింటెనెన్స్‌ పనుల కారణంగా రైళ్ల రాక పోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు వివ రణ ఇచ్చారు. మెయింటెనెన్స్‌ పనుల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. వివిధ మార్గా లలో నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగానే రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయని నివేదిక అభిప్రా యపడింది. ఈ సంవత్సరం ఆగస్ట్‌ మొదటి వారం వరకూ 14 రైలు ప్రమాదాలు జరిగాయి. ఆయా సందర్భాలను బట్టి ప్రయాణికులు చనిపోవడం లేదా గాయపడడం, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడం, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడం జరిగింది. వీటిలో అతి పెద్ద ప్రమాదం జూన్‌ 2న బాలాసోర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ తరహా ప్రమాదాలు ఆరు మాత్రమే జరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్ట్‌ రెండో వారం మధ్య కాలంలో పట్టాల వైఫల్యం, లోపాలు వంటి సంఘటనలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10% పెరిగాయి. సిగల్‌ వైఫల్యాలు 23% పెరిగాయని నివేదిక వివరించింది.