గత 9 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి వల్ల దేశం లోని 29 రాష్ఠ్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలోకి వచ్చిందని పాలక పార్టీ నిరంతర ప్రచారం చేస్తున్నది. రూ.1.25 లక్షల తలసరి వార్షిక ఆదాయం నుండి రూ.3.12 లక్షలకు పెరిగినట్లు, తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14 లక్షల కోట్లకు పెరిగి దేశంలోనే 7వ ర్యాంకుకు చేరినట్లు ఉత్సాహంగా ప్రకటించారు. రాష్ట్ర ఆదాయం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఏటా పెరుగుతున్న ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలి. కానీ, గత సంవత్సరం జరిగిన ఉత్పత్తికి ధరలు పెరగడం వల్ల పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కకట్ట రాదు. వ్యవసాయ రంగంలో గత 3 సంవత్సరాలుగా అనుకూల వాతావరణాలు సంభవించడంతో పంటల వృద్ధి జరిగింది. 2014 నుండి 2018 వరకు కరువుల వల్ల ఉత్పత్తి పెరగలేదు. కానీ, 2018 నుండి 2022-23 మార్చి వరకు అనుకూల వాతావరణం సంభవించడంతో ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. పారిశ్రామికంగా గత ఉత్పత్తిపై తగ్గింది. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. గతంలో ఉన్న పరిశ్రమల సంఖ్య తగ్గింది. సేవారంగంలోని పరిశ్రమలు కరోనా వల్ల చాలావరకు మూతపడ్డాయి. పట్టణాల్లో నిరుద్యోగం పెరిగింది. ప్రయివేట్ ఉద్యోగాలు, సాప్ట్‌వేర్ ఉద్యో గాలు, హోటల్ పరిశ్రమలు, వ్యాపారాలు, సినిమాలు, చిన్న పరి శ్రమలు లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. పట్టణాల్లో నిరు ద్యోగం పెరగడంతో గ్రామాలకు వలసలు వెళ్ళారు. అంతకు ముందే గ్రామాలలో ఉన్న నిరుద్యోగానికి వీరు తోడైనారు. మొత్తం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలకు చేరినట్లు ప్రచారం జరుగుతున్నది. కానీ, ప్రభుత్వం 17 లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ఉన్నట్లు చెప్తున్నది. గత 10 సంవత్సరా లలో ఖాళీ ఉద్యోగాలను భర్తి చేయడంలో విఫలం కావడమే గాక, ఉపాధి కల్పనలో పూర్తిగా వెనుకబడింది. రాష్ట్రంలోని 42 ప్రభుత్వశాఖలకు ప్రణాళికలు రూపొందించకుండానే కార్యక్ర మాలు కొనసాగుతున్నాయి. వార్షిక ప్రణాళికలు, లక్ష్యాలు, కార్యక్రమాలు నిర్ణయించుకోవడం వలన ఉత్పత్తి, ఉత్పాదకత క్రమపద్ధతిలో పెరుగుతుంది. వ్యవసాయరంగంలో గత మూడేండ్లుగా ఎలాంటి ప్రణాళికలు లేవు. రైతులు మార్కెట్‌లో ఉన్న ధరల బట్టి పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర సాగు విస్తీర్ణంలో 80శాతం వరి, పత్తి పంటలే వేస్తున్నారు. తృణధాన్యా లు, కూరగాయలు, పప్పులు, నూనెలు, హార్టికల్చర్ పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఆహారోత్ప త్తుల్లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు పప్పు లు, నూనెలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దిగుమతులు చేసుకుంటున్నాం. అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్న వరి ధాన్యం, పత్తి అమ్మకంలో రైతులకు కనీస మద్దతు ధరలు లభించక పెట్టుబడికి నష్టపోతున్నారు. దీనికి తోడు వ్యవసాయ ఉపకరణాల పెరుగుదలకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు పెరగకపోవడంతో రైతులు నష్టపోతు న్నారు. ప్రస్తుతం సాగులోనున్న 20 లక్షల మంది కౌలు రైతులు ప్రభుత్వ విధానాల వల్ల తమ రెవెన్యూ హక్కులు కోల్పోయారు. పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతులు రాష్ట్రానికి భారీగా పెరి గాయి. విద్యుత్‌తో పనిచేసే పరికరాలు, విద్యుత్‌యేతర పరిక రాల దిగుమతులు భారీగా సాగుతన్నాయి. సాప్ట్‌వేర్ టెక్నాలజీ కంపెనీలు పెద్దఎత్తున వచ్చినప్పటికీ అంతకన్న ఎక్కువ మంది నిరుద్యోగులు ఉత్పత్తి అవుతున్నారు. నిరుద్యోగుల పరిస్థితి గమ నించి సాప్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల వేతనాలను తగ్గించడమో లేక ఉద్యోగాల నుండి తొలగించడమో జరుగుతున్నది. ఉత్పత్తి పరిశ్రమలు మూతపడుతున్నాయి. భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర పనులకు అధునీకరణ యాంత్రీకరణ పెరగడంతో అంతకుముందున్న ఉద్యోగాలు ఊడిపోయాయి.
ప్రభుత్వానికి బడ్జెట్ ఆదాయం రావడానికి మద్యం, భూ రిజిస్ట్రేషన్ చార్జీలు పెద్దఎత్తున పెంచారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 2,90,296 కోట్లు (2023-24) కాగా, ఇందులో రూ. 40 వేల కోట్లు మద్యం నుండి (అడ్డాపన్ను, అమ్మకపు పన్నులు కలిపి) రాగా రూ.20 వేల కోట్లు రిజిస్ట్రేషన్ ద్వారా వస్తున్నది. రెవెన్యూ గ్రాంట్‌లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ (పన్నేతర ఆదాయం) ఆదా యంలో 20 శాతానికి మించి రావడం లేదు. మద్యం షాపులవారు గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లను వేల సంఖ్యలో స్థాపించడం వల్లనూ, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ప్రోత్సాహం వల్ల మద్యం అమ్మకాలు విస్తృ తంగా పెరుగుతున్నాయి. ఫలితంగా నేరాలసంఖ్య కూడా పెరుగుతున్నది. 2018లో 1,26,058 నే రాలు జరుగగా 2021లో 1,58,809 నేరాలు జరిగినట్లు పోలీసు శాఖ నివేదికలో తెలిపారు. ఇందులో 80 శాతం నేరాలకే ఎఫ్‌ఐఆర్ ను రిజిష్టర్ చేశారు. దళితులపై ఇసుక మాఫీయా దాడులు, కుల దుహంకార హత్యలు, బాలికల అమ్మకాలు, కుల బహి ష్కరణలు (బానిస సమాజ నేరాలు) పెరుగు తున్నాయి. ప్రెండ్లీ పోలీసు, షీటీంలు, సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నప్పటికీ నేరాలను అదుపు చేయలేక పోతున్నారు. చాలా నేరాలు పాలకుల ఒత్తిడితో రిజిష్టర్ కాకుండానే రద్దు చేస్తున్నారు. రక్షణ లేని పరిస్థితి పెరుగుతున్నది.
అభివృద్ధికి ప్రధాన సూచికలు ఏమిటి ?
రాష్ట్రాభివృద్ధికి ప్రధాన సంకేతం విద్య, వైద్య సౌకర్యం అభివృద్ధి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య తగ్గడాన్ని గమనంలోకి తీసుకుంటారు. పదేం డ్లు గడిచినా విద్యరంగంలో మన అభివృద్ధి 66.4 శాతం నుండి 72.8 శాతానికి పెరిగినప్పటికీ మహి ళల అక్ష్యరాస్యతలో 53.7శాతం దాటలేదు. సమాజా భివృద్ధికి అత్యంత కీలకమైన విద్యాభివృద్ధిపై ప్రణాళిక లేకపోవడంతో ప్రాప్తకాలజ్ఞతగా అభివృద్ధి జరగమే తప్ప ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి జరగడం లేదు. వంద శాతం అక్ష్యరాస్యతతో కేరళ ఏనాడో ప్రథమ స్థానంలోకి వచ్చింది. మహిళల అక్షరాస్యతలో కేరళ 97.4 శాత సాధిం చింది. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్యలో రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. దారిద్య్ర నిర్మూలనలో కేరళ మొదటి స్థానంలో ఉంది. కుడుంబశ్రీ పేర గ్రామీణ ప్రాంతా లలోని మహిళలందరికీ ఉపాధి కల్పించారు. వారికి నైపుణ్య చొరవ కల్పించడానికి క్లాసులు పెట్టి బోధిస్తున్నారు. మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ఉన్నప్పటికీ వాటి వలన ఆదాయం పొందుతున్నవారు నామమాత్రంగానే ఉన్నారు. ఈ సంఘాలను ఆకట్టుకుని అధిక వడ్డీలకు డబ్బులిచ్చి మహిళలను ఆత్మహత్యలకు గురిచేసే విధంగా మైక్రో పైనాన్స్ సంస్థలకు బలవుతున్నారు. కనీస వేతనాల అమలు లేకపోవడం వల్ల నిత్యావసర సరుకులు కొనలేని స్థితికి రాష్ట్ర ప్రజలు నెట్టపడ్డారు. కేరళలో కనీస వేతనం రూ.24,060 అమలు జరుగగా దిన కూలీ రూ.758లు ఇస్తున్నారు. జీవన ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రం కూడా ఏ ఒక్క అంశం లోనూ కేరళలో అధిగమించలేదు. అయినా గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బాగా అభివృద్ధి చెందినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థికవేత్తలు విమర్శ నాత్మకంగా అనేక నివేదికలు రూపొందించారు. అయినా వాటిని పాలకులు పట్టించుకోవడంలేదు. దళితులు, గిరిజ నులు, బీసీలు, మైనార్టీలకు, మహిళలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఉప ప్రణాళిక నిధులు 60శాతం కూడా ఖర్చు కావడంలేదు. ప్రస్తుతం కేటాయించిన నిధులేగాక అదనపు నిధులు కేటాయించి వ్యయం చేయాలి. అప్పుడే ఈ రంగాలలోని ప్రజలు అభివృద్ధి అవుతారు.
తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగు దలను చెప్పుకోవడమేగాక విద్య, వైద్య రంగం, రవాణా, శాంతి-భద్రతలలో అభివృద్ధి రావాలి. కానీ తెలంగాణ, కేరళ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలించినప్పుడు అభి వృద్ధి అంటే ఏమిటో అర్థమవుతుంది. నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధిని విశ్లే షించి అభివృద్ధి చేసేవారిని శాసన సభకు పంపించాలి. భ్రమలకు లోనై అభివృద్ధి నిరోదకులకు శాసన సభలకు పంపించడం ద్వారా ఎలాంటి ఫలితాన్ని ఆశించలేం. ఎన్నికలలో పోటీచేస్తున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రజల తరపున శాసన సభలో మాట్లాడ డానికి, ప్రశ్నించడానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారు చట్టసభల్లో ఉండాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధిని చూడగలుగుతాం.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666