రాజ్యాంగంలోని అతి చిన్న భాగం ఏది?

1. జతపరుచుము.
షెడ్యూల్‌ వివరణ
ఎ. 8వ షెడ్యూల్‌ 1.రాజ్యాంగ ఉన్నత పదవులు వారి జీతభత్యాలు
బి.2వ షెడ్యూల్‌ 2. అధికార భాషలు
సి.7వ షెడ్యూల్‌ 3. భూసంస్కరణలు మరియు
జమీందారు విధానం రద్దు
డి. 9వ షెడ్యూల్‌ 4. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన.
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ3,బి1,సి2,డి4
3.ఎ2,బి1,సి3,డి4 4. ఎ2,బి1,సి4,డి3
2. భారత రాజ్యాంగమును అర్ధ సమాఖ్యగా అభివర్ణించినవారు?
1. ఐవర్‌ జెన్నింగ్స్‌ 2. కె.సి.వేర్‌
3. అంబేద్కర్‌ 4. గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌
3. రాజ్యాంగసవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
1. దక్షిణాఫ్రికా 2. బ్రిటన్‌
3. ఫ్రెంచి 4. ఆస్ట్రేలియా
4.భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం సహకార సంఘాల గురించి తెలియజేస్తుంది?
1. 9(ఎ) 2. 9(బి) 3. 9(సి) 4. 14(ఎ)
5. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌ రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారాలు గురించి తెలియజేస్తుంది?
1. 2వ షెడ్యూల్‌ 2. 3వ షెడ్యూల్‌
3. 4వ షెడ్యూల్‌ 4. 5వ షెడ్యూల్‌
6. ఈ క్రింది వాటిలో అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించిన అంశాలను గుర్తించండి.
ఎ. రిట్లు జారీ చేయడం
బి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపు
సి. న్యాయ సమీక్షాధికారం
డి. సర్వ సైన్యాధ్యక్షుడు.
1. ఎ,బి,సి 2. బి,సి,డి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
7. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల లోని అంశాలు.
1.97,66,47 2. 100,61,52
3.98,59,52 4. 59,54,36
8. భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ సవరణ గురించి తెలియ జేస్తుంది?
1. 21 2. 22 3. 20 4. 19
9. జతపరుచుము.
భాష రాజ్యాంగ సవరణ చట్టం
ఎ. నేపాలి 1. 71వ రాజ్యాంగ సవరణ చట్టం
బి. సింధి 2. 96వ రాజ్యాంగసవరణ చట్టం
సి. సంతాలి 3. 92వ రాజ్యాంగ సవరణ చట్టం
డి. ఒడియా 4. 21వ రాజ్యాంగ సవరణ చట్టం
1.ఎ4,బి2,సి3,డి1 2. ఎ1,బి2,సి3,డి4
3.ఎ1,బి4,సి2,డి3 4. ఎ1,బి4,సి3,డి2
10. ఏ సంవత్సరం నుండి హింది అధికార భాషగా కొనసాగుతుంది?
1. 1971 2. 1956 3. 1950 4. 1965
11. క్రింది వాటిలో బ్రిటిషు రాజ్యాంగం నుండి స్వీకరించిన అంశాలను గుర్తించండి.
ఎ. ద్విసభా విధానం బి. సమన్యాయపాలన
సి. రాజ్యాంగ ప్రవేశిక డి.సభా హక్కులు
1.ఎ,బి,సి 2. ఎ,బి,డి
3. బి,సి 4. ఎ,బి,సి,డి
12. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ షెడ్యూల్‌ రాజ్యసభలో రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు తెలియజేస్తుంది?
1. 2వ షెడ్యూల్‌ 2. 5వ షెడ్యూల్‌
3. 4వ షెడ్యూల్‌ 4. 6వ షెడ్యూల్‌
13. 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దంగా ఉంటే వాటిని న్యాయసమీక్ష చేయ వచ్చునని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. కామన్‌ కాజ్‌ Vs UOI
2. XLవియర్స్‌ Vs UOI
3. ఐ ఆర్‌ కొయాల్హో Vs తమిళనాడు
4. కిహౌటో హోలాహన్‌ కేసు
14. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ దేనిని తెలియజేస్తుంది.
1. పంచాయతీ రాజ్‌
2. పార్టీ ఫిరాయింపు నిషేదం
3. దేశంలో షెడ్యూల్‌ కులాలు, జాతుల వారి పరిపాలన వివరాలు.
4. ఏదికాదు.
15. ఏ రాజ్యాంగ సవరణ చట్టంద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు?
1. 56వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 52వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 55వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
16.భారత రాజ్యాంగంలో అతి పెద్ద మరియు అతి చిన్న భాగాలు ఏవి?
1. 5వ భాగం, 14వ భాగం 2. 4వ భాగం, 14(ఎ) భాగం
3. 5వ భాగం, 20వ భాగం 4. 4వ భాగం, 20వ భాగం
17. జతపరుచుము.
భాగం వివరణ
ఎ. 14వ భాగం 1. కేంద్ర పాలిత ప్రాంతాలు
బి. 12వ భాగం 2. అధికార భాష
సి. 17వ భాగం 3. ఆర్ధిక తదితర అంశాలు
డి. 8వ భాగం 4. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ4,బి3,సి2,డి1
3.ఎ2,బి3,సి4,డి1 4. ఎ4,బి3,సి1,డి2
18.భారత రాజ్యాంగంలోని 7వ భాగాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు?
1. 5 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 7 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 97వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
19. భారత ప్రభుత్వము జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని ఏ సం.లో ప్రకటించింది?
1. 2015 2. 2010
3. 2009 4. 2011
20. రాజ్యసభ సభ్యులను ఎన్నిక చేసే విధానంను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
1.దక్షిణాఫ్రికా 2.యుఎస్‌ఎస్‌ఆర్‌ రాజ్యాంగం
3. నార్వే 4. జర్మనీ
21. భారత రాజ్యాంగంలో ట్రిబ్యునల్స్‌ గురించి తెలిపే అధికరణ?
1. ఆర్టికల్‌ 14 2. ఆర్టికల్‌ 98
3. ఆర్టికల్‌ 20 4. ఆర్టికల్‌ 14ఎ
22. జతపరుచుము.
ఎ. నిర్దేశిక నియమాలు 1.అమెరికా రాజ్యాంగం
బి. ప్రొటెం స్పీకర్‌ 2. ఫ్రెంచి రాజ్యాంగం
సి. ప్రాథమిక విధులు 3. ఐర్లాండ్‌ రాజ్యాంగం
డి. ప్రాధమిక హక్కులు 4.యుఎస్‌ఎస్‌ఆర్‌ రాజ్యాంగం
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ4,బి3,సి2,డి1
3.ఎ3,బి4,సి2,డి1 4. ఎ3,బి2,సి4,డి2
23. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వములను సభాధ్యక్షులు రద్దు చేయగలరు?
1. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 56 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
24.భారత రాజ్యాంగంలో ఎన్నికలు గురించి తెలిపే భాగం ఏది?
1. 15 2. 17 3. 19 4. 18
25. భారత రాజ్యాంగంలోని ఏక కేంద్ర లక్షణాలు క్రింది వాటిలో గుర్తించండి.
ఎ. సమీకృత న్యాయ వ్యవస్థ బి. న్యాయ సమీక్ష అధికారం
సి. కాగ్‌ డి. పౌరసత్వము
1. ఎ,బి,సి 2 బి,సి,డి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
26. భారత రాజ్యాంగమును బేరమాడే సమాఖ్యగా పేర్కొన్నవారు?
1. ఐవర్‌ జెన్నింగ్స్‌ 2. కేసివేర్‌
3. మేరిస్‌ జోన్స్‌ 4.పాల్‌ ఆపిల్‌ బి

సమాధానాలు
1.4    2.2    3.1    4.2    5.2  6.4    7.3    8.3    9.4    10.4 11.2    12.3    13.3    14.2    15.2 16.3    17.2    18.2    19.4    20.1 21.4    22.4    23.1    24.1    25.3 26.3

 

డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002