
– తెరపైకి మరో కొత్త నేత పేరు
– పోద్దుటురి సుదర్శన్ రెడ్డి నిర్ణయమే కీలకం
– బరిలో నిలిచేందుకు సై అంటున్న కెప్టెన్ కరుణాకర్ రెడ్డి టికెట్ తెచ్చకునేందుకు సిద్ధమవుతున్నారు
నవతెలంగాణ -బోధన్ టౌన్
బోధన్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది, అధికార బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది చర్చలకు తావిస్తుంది. బోధన్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం మంత్రిగా కొనసాగడం, ప్రస్తుతం నియోజక వర్గంలో చర్చనీ యాంశంగా ఉంది. బోధన్ బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున నిలిచే అభ్యర్థి ఎవరు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిపై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలకం కోనసగులాట కొనసాగుతుంది. మాజీ మంత్రి సుదర్శన్ బోధన్ నియోజక వర్గంలో కీలకమైన నేత కావడంతో ఆయన నియోజక వర్గంలో పై చేయిగా సాగుతుంది, నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలక నేత కావడంతో ఆయన కాంగ్రెస్ ఆసెంబ్లీ లో రాష్ట్ర స్థాయిలో కోశాధికారి హోదాలో కీలక వ్యక్తి కావడం ప్రస్తుతం నియోజక వర్గంలో అభ్యర్థి ములగ చర్చలకు తావిస్తోంది. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీల్లో నిలిచేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బోధన్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మంచి ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది సందేహాలకు కూడా భావిస్తుంది. కొందరు నేతలు ఆయన పోటీ చేస్తారని మరికొందరు నేతలు పోటీ చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం చేస్తున్న నేప థ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బోధన్ బరిలో నిలిచారు వినరన్నది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకొనసాగుతున్న మరో నేత కెప్టెన్ కీలకంగా మరారు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి బోధన్ సెగ్మెంట్ నుంచి టికెట్ అవకాశమిస్తే పోటీకి అప్పటికే అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి అల్లుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి కావడంతో ఆ రకంగా పార్టీలో ఉన్న సంబంధాలతో ఆయన సైతం బోధన్ బరిలో నిలిచేందుకు సయ్యంటున్నారు. ఇంకోవైపు గత కొద్ది రోజులుగా బోధన్ అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్ పార్టీలోడ్ రావచ్చని సదరు యువనేతని వచ్చే ఎన్నికల్లో బోధన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచి ప్రచారం మొదలైంది. ఈనేపథ్యంలో బోధన్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరు అన్నది ప్రత్యార్థకంగా నిలిచింది. బోధన్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కీలకమైన నేత దాదాపు గత 25 ఏళ్లుగా బోధన్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎదరులేని నాయకునిగా కొనసాగుతున్నారు. 1999, 2004, ఎన్నికల్లో బోధన్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి హయాంలో సైతం ఆయన బోధన్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బోధన్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అదికారంలో ఉండగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత టిడిపి బోర్డు సభ్యునిగా కొనసాగారు. 2000లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైన వైద్య, విద్య శాఖ ఇరిగేషన్ శాఖల మంత్రిగా పని చేశారు. ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయంలో కొనసాగించిన సందర్భంలో ఇరిగేషన్ మంత్రిగా సుదర్శన్ రెడ్డి గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 2014,2019 ఎన్నికల్లో బోధన్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి టిఆర్ఎస్ చేతి లో ఓటమి పాలయ్యారు. రెండు పర్యాయాలు ఒకే వేయి ఓట్లతోనే ఓటమి చెందిన ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది. కీలకంగా మారింది. ఇటీవల రేవంత్ రెడ్డి పిసిసి ధృక్షుని బాధ్యతలు చేపట్టాక పోద్దుటురి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర కోశాధికారి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక నేతగా ఉన్న చూడాలి మరి సుదర్శన్ రెడ్డి ఈ పర్యాయం అసెంబ్లీ బరిలో నిలిచే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆయన పోటీచే యకపోతే ఆయన చెప్పిన అభ్యర్థులనే నియోజక వర్గంలో టికెట్ కేటాయించే పరిస్థితులు సైతం ఉన్నాయి. పోటీకి సై అంటున్న కెప్టెన్ బోధన్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున చెరని ప్రచారం మొదలైంది. మున్సిపాలిటీకి ఎంపిటిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు కెప్టెన్ కరుణాక ర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే అధిష్టానానికి దర ఖాస్తు చేసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున బోధన్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలుపు గుర్రంగా ప్రచారంలో ఉండి చివరి నిమిషంలో ఓమిపాలయ్యారు. దాదాపు 10వేల పైనే ఓట్లను సాధించారు. తర్వాత బిజెపిలో చేరిన ఆయన అక్కడ ఏక్కువ కాలం ఉండలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందువు కాంగ్రెస్‌లో చేరి గాక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ పర్యాయం బోధన్ ఆసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోధన్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి హోదాలో లకున నేతగా ఉండడంతో కెప్టెన్ కరుణాకర్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు కలిసి వస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.