డిగ్రీ కాలేజ్ కు దిక్కు ఎవరు..

– ఈ ఏడాది తరగతులు కొనసాగేనా

– ప్రస్తుతం కనిపించని అధికారులు
– పై అధికారుల ఆదేశాలు ఇస్తేనే తరగతులు కొనసాగే ఆస్కారం ఇన్చార్జి ప్రిన్సిపాల్
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి దానిని మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో కొనసాగే విధంగా జుక్కల్ ఎమ్మెల్యే అనుమంతు సిందే స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించడం జరిగింది. డిగ్రీ కళాశాల ప్రారంభించారు కానీ డిగ్రీ కళాశాలకు దిక్కు ఎవరు అనే చర్చ ప్రజల్లో విస్తృతంగా కొనసాగుతోంది ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో డిగ్రీ కళాశాల కొనసాగడానికి ప్రారంభించడం జరిగినప్పటికీ ఆ కళాశాలలో డిగ్రీ కళాశాల అధికారులు కనిపించకపోవడం డిగ్రీ కళాశాలకు దిక్కు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది శనివారం నాడు నవ తెలంగాణ డిగ్రీ కళాశాల అధికారులను కలిసేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించగా డిగ్రీ కళాశాలకు కేటాయించిన కార్యాలయంలో ఏ ఒక్కరు లేకపోవడం డిగ్రీ కళాశాలకు దిక్కు ఎవరనే విధంగా ఉండటం పట్ల నవ తెలంగాణ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కు ఫోను ద్వారా వివరాలు అడిగి తెలుసుకోగా ఇప్పటివరకు ఆన్లైన్లో డిగ్రీ చదువుల కోసం 17 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు చదువుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తరగతులు ఎప్పుడు కొనసాగుతాయని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కు అడిగి తెలుసుకోగా ఈనెల 28 నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు చివరి దశగా రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు అవకాశం ఇచ్చినట్లు సెప్టెంబర్ 5 వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత  పూర్తి వివరాలు ప్రకటిస్తామని తరగతులు కొనసాగడానికి రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాలు వచ్చేవరకు తామేమి చెప్పలేమని ఇన్చార్జి ప్రిన్సిపాల్ వివరణ ఇవ్వడం దీనిని బట్టి చూస్తే మద్నూర్ మండల కేంద్రంలో ఈ ఏడాది డిగ్రీ చదువుల తరగతులు కొనసాగే విధంగా కనిపించడం లేదు దీనిని బట్టి చూస్తే డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి పరిమితం కావడం స్థానికంగా అధికారుల నియామకం చేపట్టకపోవడం డిగ్రీ కళాశాలకు దిక్కు ఎవరు అనేది చర్చనీయాంక్షంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిన దాని విధంగా ప్రత్యేకంగా అధికారులను నియమించి ఈ ఏడాది కొంతమంది విద్యార్థులతోనైనా తరగతులు ప్రారంభించాలని ఈ మండల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.