జీవవైవిధ్య గణనానికి కొలమానాలను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు ?

Who is the scientist who developed the metrics for biodiversity calculation?జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో నివసించే అన్ని రకాల జీవుల సముదాయం మొత్తాన్ని సూచిస్తుంది. ఒకే ప్రాంతంలో జీవించే జీవులలోని భిన్నత్వానికి జీవవైవిధ్యం ప్రతీకగా నిలుస్తుంది. మనం జీవించడానికి అవసరమైన ప్రతిదానికీ జీవవైవిధ్యం మద్దతు ఇస్తుంది. ప్రపంచలోని మానవునితో పాటు సమస్త జీవకోటికి కావాల్సిన ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఆవాసం, ఔషదాలు అన్ని జీవవైవిధ్యం అందిస్తున్న కానుకలుగానే భావించాలి. అటువంటి విలువయిన వనరుల్ని తగినరీతిలో వినియోగించుకోవాల్సిన మానవుడు వాటిని పెద్దఎత్తున దుర్వినియోగం చేస్తున్నాడు. ఔఔఖీ 2022లో విడుదల చేసిన లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 69 శాతం క్షీరదాలు, చేపలు, పక్షులలో అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని తెల్పింది. జీవవైవిధ్యం మరియు పర్యా వరణ వ్యవస్థ సేవలపై ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్లాట్‌ఫారమ్‌ రూపొందించిన గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం భూమ్మీద నివసిస్తున్న 1 మిలియన్‌ జంతు మరియు వక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించింది. ఈ జీవ విధ్వంసాన్ని ఆపకపోతే రానున్న రోజుల్లో డైనోసార్సు లానే మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
1. జీవవైవిధ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు ?
ఎ. రోసేన్‌ బి. విట్టెకర్‌
సి. లోజారు డి. రస్సెల్‌ మిట్టర్‌ మీర్‌
2. ఈ కింది వాటిలో జీవవైవిధ్యం దేనిని సూచిస్తుంది?
ఎ. మొక్క నిర్దిష్ట జాతి
బి. భూమిపై వివిధ రకాల జీవులు
సి. శిలల అధ్యయనం
డి. జనాభాలో వ్యక్తుల సంఖ్య
3. కింది వాటిలో ఏది జీవవైవిధ్య స్థాయి కాదు?
ఎ. జన్యు వైవిధ్యం
బి. పర్యావరణ వ్యవస్థ వైవిధ్యం
సి. జాతుల వైవిధ్యం
డి. జనాభా వైవిధ్యం
4. ‘బయోడైవర్సిటీ’ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
ఎ. డబ్ల్యూ.జి. రోసేన్‌
బి. ఇ.పి. ఒడం
సి. ఇ.ఒ. విల్సన్‌ డి. రస్సెల్‌ మిట్టర్‌ మీర్‌
5. ఈ కిందివాటిలో ఆవరణ వ్యవస్థల్లోని జాతుల సంఖ్యలో వచ్చే మార్పులని సూచించే వైవిధ్యత ఏమిటి?
ఎ. ఆల్ఫా- వైవిధ్యత (డైవర్సిటీ)
బి. బీటా- వైవిధ్యత (డైవర్సిటీ)
సి. గామా- వైవిధ్యత (డైవర్సిటీ) డి. పైవేవి కాదు
6. బీటా-వైవిధ్యత (డైవర్సిటీ) దేనిని సూచిస్తుంది?
ఎ. జన్యు మార్పులని
బి. జీవుల సంఖ్యలో వచ్చే మార్పులని
సి. జీవులలో వచ్చే మార్పులని
డి. ఆవాసాలలో వచ్చే మార్పులని
7. పంటజాతి మొక్కల వైవిధ్యంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
ఎ. బంగ్లాదేస్‌ బి. ఇండియా
సి. జపాన్‌ డి. చైనా
8. క్షీరదజాతుల వైవిధ్యంలో ఇండియా ఎన్నవ స్థానం లో ఉంది ?
ఎ. 10 వ స్థానం బి. 11 వ స్థానం
సి. 8 వ స్థానం డి. 2 వ స్థానం
9. ఈ కింది వాటిలో జీవవైవిధ్యానికి ఏవి ఎక్కువ నష్టాన్నికలిగిస్తాయి ?
ఎ. వాతావరణ మార్పు
బి. మానవ కార్యకలాపాలు
సి. ప్రకతి వైపరీత్యాలు
డి. పరిణామ ప్రక్రియలు
10. జీవవైవిధ్య నష్టానికి దోహదపడే అటవీ నిర్మూలన, ఆవాస విధ్వంసానికి ప్రధాన కారణం ఏమిటి?
ఎ. పారిశ్రామిక కాలుష్యం
బి. పట్టణీకరణ
సి. వ్యవసాయ విస్తరణ
డి. వాతావరణ మార్పు
11. ఈ కింది ఆవాసాలలో జీవవైవిధ్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?
ఎ. ఎడారి ప్రాంతాల్లో
బి. టైగా అరణ్యాలు
సి. ఉష్ణమండలపు అరణ్యాలు –
డి. ధ్రువ ప్రాంతాల్లో
12. జీవవైవిధ్య గణనానికి కొలమానాలను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ. డార్విన్‌ బి. విట్టెకర్‌
సి. లామార్క్‌ డి. డబ్ల్యూ.జి. రోసేన్‌
13. బహత్‌ జీవవైవిధ్యం (వీవస్త్రa దీఱశీసఱఙవతీరఱ్‌y) అనే పదాన్ని మొదటిసారి ప్రవేశ పెట్టింది ఎవరు?
ఎ. డబ్ల్యూ.జి. రోసేన్‌ బి. ఇ.పి. ఒడం
సి. నార్మన్‌ మేయర్‌ డి. రస్సెల్‌ మిట్టర్‌ మీర్‌
14. ప్రపంచంలో ఎన్ని బహత్‌ జీవవైవిధ్యం(వీవస్త్రa దీఱశీసఱఙవతీరఱ్‌y) కలిగిన దేశాలు ఎన్ని ?
ఎ. 10 బి. 17 సి. 18 డి. 12
15. ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశం ఏది ?
ఎ. ఇండియా బి. అమెరికా
సి. ఆస్ట్రేలియా డి. దక్షిణ ఆఫ్రికా
16. అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాల్లో భారత దేశానిది ఎన్నవ స్థానం ?
ఎ. 10 వ స్థానం బి. 7 వ స్థానం
సి. 12 వ స్థానం డి. 2 వ స్థానం
17. భారతదేశంలో ఎంత శాతం స్థానీయమయిన (ఎండమిక్‌) జాతులు ఉన్నాయి ?
ఎ. 10 శాతం బి. 13 శాతం
సి. 23 శాతం డి. 33 శాతం
18. ”హాట్‌ స్పాట్స్‌” అనే భావనని ప్రవేశపెట్టింది ఎవరు ?
ఎ. డబ్ల్యూ.జి. రోసేన్‌ బి. ఇ.పి. ఒడం
సి. నార్మన్‌ మేయర్‌ డి. రస్సెల్‌ మిట్టర్‌ మీర్‌
19. ఈ కింది వాటిలో ఏ లక్షణాలు ఉంటే వాటిని హాట్‌ స్పాట్స్‌ గా గుర్తిస్తారు ?
ఎ. స్థానీయమయిన (ఎండమిక్‌) జాతులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు
బి. మానవ ప్రమేయం వల్ల 70 శాతం వక్ష సంపదని కోల్పోయిన ప్రదేశాలు
సి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన స్థానీయ జాతులలో కనీసం 0.5 శాతం కలిగిఉన్న ప్రదేశాలు
డి. పైవి అన్ని
20. ప్రపంచంలో ఎన్ని జీవవైవిధ్య హాట్‌ స్పాట్స్‌ ని గుర్తించారు ?
ఎ. 65 బి. 56 సి. 36 డి. 63
21. భారతదేశంలో ఎన్ని ఎకాలజికాల్‌ హాట్‌ స్పాట్స్‌ ని గుర్తించారు ?
ఎ. 9 బి. 4 సి. 6 డి. 3
22. ”కీటోన్‌ జాతులు” అనే పదం ఈ కింది వానిలో దేనిని సూచిస్తుంది ?
ఎ. అరుదైనవి మరియు అంతరించిపోతున్న జాతులు
బి. పర్యావరణ వ్యవస్థపై అత్యంత ప్రభావాన్ని కలిగి ఉండే జాతులు
సి. వర్షారణ్యాలలో మాత్రమే కనిపించే జాతులు
డి. కాలుష్య సూచికలుగా ఉపయోగపడే జాతులు
23. ఈ కింది వాటిలో దేనిని కీటోన్‌ జాతిగా గుర్తిస్తారు ?
ఎ. పులి బి. జింక
సి. గడ్డి మిడత డి. తొండ
24. ”పర్యావరణ వ్యవస్థ-ఆధారిత అనుసరణ” అనే భావన ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది ?
ఎ. వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవావరణ వ్యవస్థల్లో జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడం
బి. కత్రిమంగా పర్యావరణ వ్యవస్థలను రూపొందించడానికి సాంకేతికతలను అభివద్ధి చేయడం
సి. పరిరక్షణ కోసం పర్యావరణ వ్యవస్థల నుండి జన్యు పదార్థాన్ని సంగ్రహించడం
డి. పర్యావరణ వ్యవస్థల నుండి ఆక్రమణ జాతులను తొలగించడం
25. ”గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఔట్లుక్‌” అంచనా ప్రకారం భూమ్మీద ఎన్ని జీవజాతులు నివసిస్తున్నాయి ?
ఎ. 170 మిలియన్లు బి. 140 మిలియన్లు
సి. 106 మిలియన్లు డి. 300 మిలియన్లు
సమాధానాలు
1.సి 2.బి 3.డి 4.సిి 5.ఎ
6.డి 7.బి 8.సి 9.బి 10.సి
11.సి 12.బి 13.డి 14.బి 15.సి
16.బి 17.డి 18.సి 19.డి 20.సి
21.బి 22.బి 23.ఎ 24.ఎ 25.బి
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918