– తనపై వస్తున్న విమర్శలు సరికాదు
– ప్రజాసేవ తప్ప మరో వ్యాపకం లేదు
– టికెట్ అడగడంలో తప్పేంటి
– ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
టికెట్ ఎవరికి వచ్చినా… సహకరిస్తానని ,తనపై వస్తున్న విమర్శలు సరికాదని ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ప్రజాసేవ తప్ప మరో వ్యాపకం లేదు. 30ఏళ్ల రాజకీయ జీవితంలో పారదర్శకంగా పనులు చేసి ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్నాను. తనపై ఎవరెన్నీ విమర్శలు చేసినా… ప్రజలే న్యాయ నిర్నేతలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అదిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా నేను మద్దతు ఇస్తానని తెలిపారు. నాకుమారుడు సైతం టికెట్ అడుగుతున్నాడు. టికెట్ విషయంలో మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి అవకాశమిస్తే.. బేషరుతుగా సపోర్టు చేస్తానని తెలిపారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే ఆగడాలను అంతం చేయడానికి ఇరువర్గాలు కలిస్తేనే… సాధ్యమౌ తోందన్నారు. ఇటువంటి విధానాలను అంతం చేయడానికి ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.