– ప్రగతిభవన్ ముట్టడికి
లంబాడి హక్కుల పోరాట సమితి యత్నం
నవతెలంగాణ – బంజారాహిల్స్
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే నివాసాల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కు ల పోరాట సమితి నాయకులు పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు నాయకుల ను ముందస్తు అరెస్టు చేసి నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హెల్త్ డైరెక్టర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ వారు పోలీస్ స్టేషన్‌లోనే కరపత్రాలు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. మరోవైపు, కొందరు నాయకులు ప్రగతిభవన్ వద్దకు నిరసన చేపట్టేందుకు యత్నించగా పంజాగుట్ట పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.