సమ్మె విరమించిన అరెస్టులు ఎందుకు?

నవతెలంగాణ- నవీపేట్: గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె విరమించిన కార్మికులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని కార్మిక సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నవీపేట్ పోలీస్ స్టేషన్ లో సిఐటియు నాయకులతో పాటు కార్మికులు, కారోబార్ లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఎస్సై యాదగిరి గౌడ్ ను కార్మికులు సమ్మె విరమించిన పత్రాన్ని చూపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిఎఫ్, ఈఎస్ఐ, వారంతపు, పండుగ సెలవులు తదితర హామీలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని తెలపడంతో తాత్కాలికంగా సమ్మెను విరమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, ఆంజనేయులు, లక్క గంగారం, తులసిరామ్ తదితరులు ఉన్నారు.