– పట్టుబడ్డ మద్యం, నగదు
వనపర్తి రూరల్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జిల్లా చెక్పోస్ట్ లను వనపర్తి జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలో ఒక లక్ష 93 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెబ్బేరు మండలం నందు కొల్లాపూర్ చౌరస్తా చెక్పోస్ట్ దగ్గర 13 వేల వనపర్తి రూరల్ పిఎస్ పరిధిలోగల మరి కుంట దగ్గర 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి తెలిపారు. పెబ్బేరు మండలం కొల్లాపూర్ చౌరస్తా దగ్గర చెక్పోస్ట్ నందు ఒక వ్యక్తి నుంచి 1,33,000 , ఆత్మకూరు, శ్రీరంగాపూర్, రేవెల్లి, పెబ్బేర్, గోపాల్పేట్, వనపర్తి టౌన్ నందు 191 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధా రాలను చూపాలని తెలిపారు.లేని యెడల నగదు, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు 913 లీటర్ల మద్యాన్ని స్వాదిన పరుచుకున్నమని, వాటి విలువ రూ.5,54,670/- ఉంటుంది.రూ. 29,53,290/- ల క్యాష్, సీజ్ చేయడం జరిగిందని , ఎన్నికలను స్వేచ్ఛ , నిష్పక్షపాతముగా నిర్వహించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని తెలిపారు.