మునుగోడు ఎమ్మెల్యేగా దోనూరి నర్సిరెడ్డిని గెలిపించండి..

 – చిన్న కొండూరు సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి ఆదిమూలం నందీశ్వర్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించాలని చిన్న కొండూరు సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి ఆదిమూలం నందీశ్వర్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలనందీశ్వరి మాట్లాడుతూ మునుగోడు నుండి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి ఎర్రజెండా పక్షాన ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ నమూనా బ్యాలెట్ పేపర్ తో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న కొండూరు మాజీ ఎంపిటిసి ఎలుకరాజు యాదగిరి, చెరుకు అడవయ్య, గడగట్టి జంగయ్య, తూర్పునూరి జంగయ్య, ఎస్.కె ఇబ్రహీం, మల్లయ్య, చీమకండ్ల శ్రీరాములు, తీగుళ్ల బాలయ్య, పోట్ట సాయికుమార్, చక్రం శీను, బొందయ్య లింగస్వామి, సోయల్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.