అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు


-డిప్యూటీ కమిషనర్‌ డీడీి నాయక్‌
-గోషామహల్‌లో ఘనంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
గోషామహల్‌ జిహెచ్‌ఎంసి సర్కిల్‌ -14 యూసీడీ ఆధ్వర్యంలో మంగళవారం చుడి బజారులోని మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ డిప్యూటీ కమిషనర్‌ డి డి నాయక్‌ పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని అన్నారు.ఈ సందర్భంగా ప్రతిభావంతులైన మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుసీడీపీ ఓ విద్యాసాగర్‌.సీఓ లు రాంబాబు. మహిళా నాయకురాలు రాధిక. ఆర్పీలు. మహిళలు. జిహెచ్‌ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు