మండలంలోని బషీరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు పాలాభిషేకం చేశారు. మహిళ సంఘ భవనం ప్లోరింగ్ కు రూ.5లక్షలు మంత్రి ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మహిళా సంఘాల సభ్యులు సర్పంచ్ సక్కారం అశోక్ మంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. మహిళా సంఘ భవనంలో అదనపు పనుల కోసం నిధులు మంజూరు చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి గ్రామ మహిళ సంఘాల సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ సీసీ భాగ్యలక్ష్మి, విఓఏ లు రజిత, కృష్ణవేణి, రుచిత, భాగ్యలక్ష్మి, మహిళ సంఘ సభ్యులు గంగామణి, ముత్తు, లక్ష్మీ, ఎర్రవ్వ, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.