ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మహిళా ప్రభంజనం

క్రీడాకారిణులు మళ్ళీ మళ్ళీ తమ సత్తా చాటుతూనే ఉన్నారు. దేశానికి పతకాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ప్రపంచ నలుమూలల మన జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఇటీవలె థారులాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో పాల్గొన్నారు. భారతదేశ అథ్లెట్‌లు మొత్తం 13 పతకాలను గెలుచుకోగా అందులో మహిళల పాత్ర కూడా కీలకంగా ఉంది. వారిలో మన తెలుగు తేజం జ్యోతి యర్రాజి ఒకరు. అలాగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అథ్లెట్‌ల పోరాటంలో భాగస్వామి అయిన సంగీతా ఫోగట్‌ బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో కాంస్యం సాధించింది. ఆ వివరాలు నేటి మానవిలో…
జ్యోతి యర్రాజి…
వైజాగ్‌కు చెందిన ఈమె 28 ఆగస్టు, 1999 పుట్టింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో నైపుణ్యం కలిగిన భారతీయ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌. 10 మే 2022న 13.23 సెకనులు పరిగెత్తి అనురాధ బిస్వాల్‌ దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టింది. తర్వాత 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత జాతీయ రికార్డును సృష్టించింది. అప్పటి నుండి తన రికార్డును తానే చాలాసార్లు బద్దలు కొట్టింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఫైనల్స్‌లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళల 4ఞ100 మీటర్ల రిలే జట్టులో భాగమైంది.
2022 భారత జాతీయ క్రీడల ఎడిషన్‌లో 100 మీటర్లు, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. 17 అక్టోబరు 2022న 13 సెకన్ల కంటే తక్కువ సమయం గమ్యాన్ని చేరిన మొదటి భారతీయ మహిళా హర్డిలర్‌గా అవతరించింది. ఇదే ఏడాది 100 మీటర్ల మహిళల హర్డిల్స్‌లో రెండవ అత్యుత్తమ ఆసియన్‌గా, 11వ అత్యుత్తమ ఆసియా క్రీడాకారిణిగా నిలిచింది. 2022 ఇండియన్‌ ఓపెన్‌ నేషనల్స్‌లో మహిళల్లో అత్యుత్తమ అథ్లెట్‌గా ఎంపికైంది. 2023 ప్రారంభంలో ఆస్తానాలో జరిగిన 2023 ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. అంతేకాదు ఇండోర్‌ 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డును ఐదుసార్లు బద్దలుకొట్టింది. ఇప్పటి ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో మహిళల 200 మీటర్ల ఫైనల్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకం సాధించడంతో తన క్రీడను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తుంది.
పరుగు వైపు ఆకర్షితురాలై…
ప్రియాంక గోస్వామి… ఈమె 20 కిలోమీటర్ల రేస్‌ వాక్‌లో పోటీపడే భారతీయ క్రీడాకారిణి. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 17వ స్థానంలో నిలిచింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 10000 మీటర్ల నడకలో రజత పతకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళ. ప్రియాంక అథ్లెటిక్స్‌కు రాకముందు పాఠశాలలో జిమ్నాస్టిక్స్‌ సాధన చేసేది. గెలిచిన పోటీదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను చూసి ఉత్సా హపడి పరుగు వైపు ఆకర్షితురాలైంది. ఫిబ్రవరి 2021లో 20 కి.మీ రేసులో ఇండియన్‌ రేస్‌వాకింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకుంది. 2020 సమ్మర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2017 లో కూడా ఇండియన్‌ రేస్‌వాకింగ్‌ ఛాంపి యన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023లో మహిళల రేస్‌ వాక్‌ ఈవెంట్‌లో 1:34:24 సమయంతో రజత పత కాన్ని సాధించి మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె భారతీయ రైల్వేలో ఓఎస్‌గా పనిచేస్తుంది.
ప్రపంచ అగ్రగామిగా…
మన్‌ప్రీత్‌ కౌర్‌… పాటియాలాలోని సహౌలీ గ్రామానికి చెందిన ఈమె అంబాలాలో పుట్టింది. ఈమె ప్రొఫెషనల్‌ ఒలింపిక్‌ షాట్‌ పుటర్‌. 2017లో చైనాలోని జిన్హువాలో జరిగిన ఆసియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో 18.86 మీటర్ల గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుని ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 స్థానానికి చేరుకుంది. మహిళల షాట్‌పుట్‌లో 17.96 మీటర్ల భారత జాతీయ రికార్డును కూడా కలిగి ఉంది. షాట్‌పుట్‌లో రియో 2016లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ముగ్గురు తోబుట్టువులలో కౌర్‌ పెద్దది. ఆమె 13 ఏండ్ల వయస్సులో తండ్రి మరణించాడు. తల్లి 2006లో పక్షవాతానికి గురైంది. తండ్రి ప్రోత్సాహం, బంధుమిత్రుల సహకారంతో అథ్లెటిక్స్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఆమె కజిన్‌లలో ఒకరు యూనివర్సిటీ స్థాయి 100మీ స్ప్రింటర్‌, మరొకరు డిస్కస్‌ త్రోయర్‌, ఆమె కోడలు కూడా షాట్‌ పుటర్‌. ఆమె మొదట్లో 100మీ లో ఏడాది పాటు శిక్షణ పొందింది. 2007లో ఓస్ట్రోవాలో జరిగిన 5వ ×AAఖీ వరల్డ్‌ యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో 9వ స్థానంలో నిలిచింది. 2010లో 3 ఏండ్ల విరామం తీసుకుని మహిళల షాట్‌పుట్‌లో 18 ఏండ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టేందుకు తిరిగి వచ్చింది. 2015లో కోల్‌కతాలో జరిగిన 55వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 17.96 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెలుచుకుంది. రియో 2016 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారతీయ మహిళ కౌర్‌.
ఆసియా గ్రాండ్‌ ప్రిక్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ మొదటి లెగ్‌లో జాతీయ రికార్డు, ప్రపంచ సీజన్‌-ప్రధాన ప్రయత్నంతో స్వర్ణం సాధించింది. తన అత్యుత్తమ త్రో 18.86 మీటర్లతో జాతీయ రికార్డును నెలకొల్పింది. బ్యాంకాక్‌లో జరి గిన ఆసియా అథ్లెట్స్‌లో మహిళల షాట్‌పుట్‌ తరపున రజత పతకాన్ని గెలుచుకుని జాతీయ రికార్డును సృష్టించింది. ఈ ప్రదర్శనతో ఆమె ఈ ఏడాది ఆగస్టులో లండన్‌లో జరగనున్న ×AAఖీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో పని చేస్తున్న ఆమె తన ట్రైనర్‌గా ఉన్న యూనివర్సిటీ స్థాయి షాట్‌పుటర్‌ కరమ్‌జీత్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ అమ్మాయి ఉంది.
గతం కంటే బలంగా…
అభా ఖతువా… 28 ఏండ్ల ఆమె గత మూడు పోటీల్లో మాత్రం కేవలం 15.98, 16.57, 16.39 మాత్రమే చేయగలిగింది. ఈ ఏడాది మాత్రం మహిళల షాట్‌పుటర్లు భారతదేశానికి రజత పతకం తెచ్చిపెట్టింది. 18.06 మీటర్లతో సమం చేసిన అభా ఖతువా అత్యంత ఆశ్చర్యకరమైన ప్రదర్శన చేసింది.

డాపెస్ట్‌లో సంగీతా ఫోగట్‌
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేత అయిన సంగీతా ఫోగాట్‌ బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ 2023లో 59 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై నిరసన తెలిపిన రెజ్లర్లలో సంగీత కూడా ఉంది. ఇప్పుడు తాను సాధించిన ఈ విజయాన్ని లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది సంగీత.
తొలి భారతీయ రన్నర్‌
పరుల్‌ చౌదరి... మీరట్‌కు చెందిన ఈమె 15 ఏప్రిల్‌ 1995 పుట్టారు. 5000 మీటర్లు, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నైపుణ్యం కలిగిన భారతీయ అథ్లెట్‌. మహిళల 3000మీటర్ల పరుగుపందెంలో 9 నిమిషాల్లో గెలిచిన తొలి భారతీయ రన్నర్‌. చిన్నతనం నుండి అథ్లెట్‌ అంటే ఎంతో ఆసక్తి చూపించేది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 6 నుండి 9 జూలై 2017లో జూలై 6 నుండి 9 వరకు జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌షిప్స్‌ దక్కించుకుంది. 2023లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం గెలుచుకుంది.