– బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్
నవతెలంగాణ-హైదరాబాద్
మహిళా జర్వేషన్ బిల్లు సాధించడంలో ఎమ్మెల్సీ, భారత జాగతి అధ్యక్షు రాలు కల్వకుంట్ల కవిత పాత్ర చాలా గొప్పదని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఆయన ప్రవాసుల తరపు న కవితకు ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వే షన్ బిల్లు కోసం కవిత అనేక ఆందోళన కార్యక్రమా లను చేపట్టారని గుర్తు చేశారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఏ గ్యారెంటీ వారంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అభిప్రాయపడ్డారు. 60 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ విమర్శించారు. కాంగ్రెస్‌ని మరో సారి నమ్మితే ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని అమ్మేస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలు మూడో సారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తారని, రానున్న ఎన్నికల్లో వంద సీట్లతో కెేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.