నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ప్రగతి యాత్రలో భాగంగా 55వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద పర్యటన
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని పార్టీలకతీతంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గురువారం గాజుల రామారం డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 55వ రోజు సందర్భంగా రావి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్, ఫేస్-2, ఫేస్-3 లలో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పాద యాత్ర చేశారు. కోట్ల నిధులతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్బ డ్రయినేజీ అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంతో పోల్చితే వారి బస్తీలను అన్ని రంగాల్లో అభివద్ధి చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఈ రూపాదేవి, డీజీఎం అప్పల నాయుడు, ఏఈ కళ్యాణ్, మేనేజర్ రోహిణి, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, ఇబ్రహీం, పీట్ల మల్లేష్, నర్సింహా, నారాయణ, సురేష్, రా జు, రాజేందర్, యాదవ రావు బస్తీల ప్రజలు పాల్గొన్నారు.