సకాలంలో పనులు పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్ర మాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. కలెక్టర్‌ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి అన్ని మండ లాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, మున్సిప ల్‌ కమిషనర్లతో జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులవృత్తుల పైనే ఆధారపడిన వారి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష రూపాయల ఆర్థికసాయం అందించనున్నందున, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరా లను క్షేత్రస్థాయిలో పరిశీలన గావించి అర్హుల జాబి తాను సిద్ధం చేసి, ఆ జాబితాను ఆన్‌లైన్‌లో పొందు పరచాలన్నారు. లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి పొర పాట్లు జరగకుండా పద్ధతి ప్రకారంగా ఈ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభు త్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎంపిక చేసి, అనర్హులను రిజెక్ట్‌ చేయాలన్నారు. రిజెక్ట్‌కు గల కార ణాలను స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామా పంచాయతీలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకను కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు స్థల సేకరణ జరగలేదని, ఈ పనులను సోమవారం వర కు పూర్తి చేయాలన్నారు. గ్రామానికి దగ్గరగా అందరికీ ఉపయోగపడేలా స్థల సేకరణ జరగాలన్నా రు. అవసరం మేరకు అటవీ స్థలాలలో క్రీడా ప్రాంగ ణాలను ఏర్పాటు చేసేందుకు వెంటనే ఎస్టిమేషన్లు పంపాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 8 విడుతలుగా మొక్కలు నాటడం జరిగిందని, అయినప్పటికీ ఆశించినంతగా ఫలితం రాలేదన్నారు. ఈసారి 9వ విడతలో పకడ్బందీగా మొక్కలు నాటేందుకు అధికారులందరూ సిద్ధం కావా లని సూచించారు. పెద్ద సైజు ముక్కలతో అవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, అవెన్యూ ప్లాం టేషన్‌లేని రోడ్లు కనపడకూడదన్నారు. నాటిన మొక్కలకు ట్రీ-గార్డులు ఏర్పాటు చేసి సంరక్షించా లని సూచించారు. ఈసారి హరితహారంలో కోనో కార్పస్‌ మొక్కలు నాటరాదన్నారు. మొక్కల సంరక్ష ణలో గ్రామ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పూర్తి బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాలలో గల ఖాళీ స్థలాలలో దట్టంగా ముక్కలు నాటి ఖాళీలను పూర్తి చేయాలన్నారు. వైకుంఠధా మాలలో మొక్కలు నాటి పార్కుల లాగా అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. కంపోస్టు షెడ్లు, నర్సరీ లు, పాఠశాలలలు, ప్రభుత్వ కార్యాలయంలతో పాటు అన్ని ప్రాంతాలలో లక్ష్యం మేరకు విరేగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తు న్నందున గుంతలు తవ్వే పనులు వేగవంతం చేసి మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలన్నారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) రాహుల్‌ శర్మ, జిల్లా ఆటవిశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, డిఆర్‌డి ఓ కష్ణన్‌, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సి ఈఓ సుభాషిని, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్‌, డిపిఓ తరుణ్‌ కుమార్‌, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.