లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

World Tourism Day is celebrated under the aegis of Lions Clubనవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు అంతర్జాతీయ పర్యటక దినోత్సవ (వరల్డ్ టూరిజం డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ పంచారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దురిశెట్టి అనంత రామకృష్ణ మాట్లాడుతూ.. 1980లో ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్, 27 న అంతర్జాతీయ పర్యటక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారని, మన రాష్ట్ర, కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నాయని మన దేశం ఎన్నో పర్యటక కేంద్రాలకు నిలయం, మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఎంతో మంది విదేశీ పర్యటకులు మన భారత దేశాన్ని సందర్శిస్తున్నారని, తద్వారా మన దేశానికి ఆర్థిక వనరులు కలిగి దేశం పురోగతికి టూరిజం ఉపయోగకరంగా ఉంటుందనీ తెలిపారు. మా కళాశాలలో ఒకేషనల్ టూరిజం గ్రూప్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ టూరిజం విద్యను చదివి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వివిధ రంగాలలో ముఖ్యంగా టూరిజం, హోటల్ పరిశ్రమలలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా దొరుకుతున్నాయని పేర్కొన్నారు. కాలనుగుణంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా టూరిజం కోర్సులను చదువుతున్న విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీట్లు, పండ్లు పంచారు.అలయన్స్ క్లబ్ మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని జరపడం వల్ల సామాజిక, చారిత్రక, సాంస్కృతిక,ఆర్థిక అంశాల పరంగా టూరిజం ప్రాధాన్యతను విద్యార్థులు అవగాహన చేసుకొని మన ప్రాచీన, సంస్కృతిక, చారిత్రక, వారసత్వ కట్టడాలను, స్మారకాలను, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దురిశెట్టి అనంత రామ కృష్ణ, అలయన్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్, జిల్లా -258 రీజనల్ చైర్మన్ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, జోన్ చైర్మన్ ఎలగందుల అశోక్, కోశాధికారి తోడేటి మురళి గౌడ్, పి ఆర్ ఓ కోల తిరుపతి, ఉపాధ్యక్షులు బైరి చంద్రమౌళి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.