అంగన్వాడీల అక్రమ అరెస్టును ఖండిస్తూ ధర్నా రాస్తారోకో బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు చలో హైదరాబాద్ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయటం కొరకు అంగన్వాడీ ఉద్యోగులు హైదరాబాద్ తరలి వెళ్తున్న సందర్భంగా ఎక్కడికి అక్కడ అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం జరిగింది జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ స్థానిక ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతోపాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించటం జరిగింది. దర్భంగా గౌరవ అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత 24 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోవడంతో తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి మొరపెట్టుకోవటానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి నుండి ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తూ గ్రోనిర్బంధం లో ఉంచుతూ పోలీస్ స్టేషన్లకు తరలించటం జరిగిందని దీని మూలంగా మహిళలపై నా ప్రభుత్వం తన చులకన భావాన్ని మరొకసారి బయట పెట్టుకుందని ఆయన విమర్శించారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అరెస్టు చేసిన అంగన్వాడి ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడి ఉద్యోగులు ఐక్యంగా పోరాడుతారని హెచ్చరించారు. అనంతరం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నిజాంబాద్ వారితో మాట్లాడి అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కటారి రాములు మల్యాల గోవర్ధన్ అంగన్వాడి యూనియన్ నాయకులు సరిత, సందీప ,జరీనా, తదితరులతో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.