యుగంధర్‌పై దాడిని నిరసిస్తూ రాస్తారోకో

నవతెలంగాణ- మోత్కూర్‌
న్యాయవాది పర్రెపాటి యుగంధర్‌ పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అనుచరుల దాడికి నిరసనగా మోత్కూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సోమవారం అఖిలపక్షం, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌ ప్రతిపక్ష నాయకులే ఉండకూడదన్న భావనలో ఉన్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు దాడులకు ఉసుగొల్పుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన యుగేందర్‌ ను ఎమ్మెల్యే అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని, ఎమ్మెల్యే వెంటనే స్పందించి యుగంధర్‌ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బయ్యని రాజు, రైల్వే బోర్డు మెంబర్‌ కొణతం నాగార్జున రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్న, టీడీపీ మండల అధ్యక్షుడు సుదగాని పాండు, బీఎస్పీ నాయకుడు ఎర్రవెల్లి నర్సయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి పుల్కరం మల్లేష్‌, నాయకులు పన్నాల శ్రీనివాస్‌ రెడ్డి, మరాటి అంజయ్య, డి.సత్యనారాయణ ఎండి. గాలిబ్‌, సజ్జనం మనోహర్‌, రాచకొండ బాలరాజు, పోచం సోమయ్య, చొల్లేటి నరేష్‌, కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.