నవతెలంగాణ- నవీపేట్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడిన ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిరసనగా మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీలో పంచాయతీ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికార, ప్రతిపక్ష 20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, భుజంగరావు, నరేష్, తులసిరామ్, పోసాని పోశెట్టి మరియు కార్మికులు పాల్గొన్నారు.