సెప్టెంబర్‌ 12 నుంచి జేఎల్‌ పోస్టులకు రాతపరీక్షలు

ఆగస్టు 8న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌ : టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో నియామక పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు ఎనిమిదో తేదీన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీఆర్టీ) ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనరేట్‌ పరిధిలో ప్రకటించిన 1,392 జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ మూడో తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. షెడ్యూల్‌, ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు.