నేటి నుండి శ్రీసంతోషిమాత ఆలయంలో యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలు

– శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి, భయాంజనేయస్వామి ఆలయాల ప్రారంభం
నవతెలంగాణ-మంగపేట
సోమవారం నుండి మండలంలోని నర్సాపురం బోరు గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీసంతోషిమాత ఆలయంలో యంత్ర ప్రతిష్టతో పాటు ఉప ఆలయాలైన శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, శ్రీఅభయాంజనేయస్వామి ఆలయా ల్లో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపాంది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 29 నుండి 31 వరకు ఆలయంలో యంత్ర ప్రతిష్టా శ్రీసంతో షిమాత విగ్రహ ప్రతిష్టా, శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టా, శ్రీఅభయాంజనేస్వామి విగ్రహ ప్రారంభ కార్యక్ర మాలను నిరంతరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్య క్రమాలను ఆంధ్రప్రదేశ్‌ కు సామర్లకోటకు చెందిన చీమల కొండ లక్ష్మీనారాయణశర్మ ఆధ్వర్యంలో యంత్ర, విగ్రహ ప్రతిష్టా ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 31న వేలాది మందికి మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయాల ప్రారంబానికి దాతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.