నవతెలంగాణ- డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి లోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎస్ జిఎఫ్ స్కూల్ గేమ్స్ అండర్ U/19 రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సంగీత గురువారం తెలిపారు. ఈనెల 3 నుండి 5 వరకు బూరుగుపల్లి గజ్వేల్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నీరజా రెడ్డి, పిఈటీ జోష్ణ, వైస్ ప్రిన్సిపల్ కిషన్, హౌస్ టీచర్స్ మమత, నూరున్నిస, అద్యపక బృందం, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.