ఎన్నికలలో లబ్ధి కోసమే పసుపు బోర్డు ప్రకటన

– బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ 
 నవతెలంగాణ- కమ్మర్ పల్లి:  రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన చేశారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని  ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మాట చెప్పాడని… మళ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో  రైతులను మోసం చేసేందుకే పసుపు బోర్డు ప్రకటనతో నాటకమాడుతున్నారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, బీజెపి పార్టీకి నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు కోసం బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు బీజెపి నాయకులు  మభ్యపెడతారన్నారు. ఎద్దు ఎవుసం తెల్వని కాంగ్రెస్ ను, రైతును మోసం చేసే బీజేపీని నమ్మితే రైతులు అరిగోస పడాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఈ సమావేశంలో చౌట్ పల్లి సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, సర్పంచ్ గడ్డం స్వామి, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ హుస్సేన్, మండల రైతు విభాగం అధ్యక్షుడు బద్దం రాజశేఖర్, మండల ఉపాధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చింత గణేష్, యూత్ మండలాధ్యక్షుడు కొత్తపల్లి రఘు, నాయకులు కొత్తపల్లి అశోక్, పన్నాల గంగారెడ్డి, రేంజర్ల మహేందర్, రేణి విజయ్ కుమార్, సుంకరి మురళి, లోలపు సుమన్, హల్దే  శ్రీనివాస్, తీగల హరీష్, మహేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.