నువ్వా… నేనా…?

నవతెలంగాణ- సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది బరిలో నిలిచిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు. అపధర్మ మంత్రి కే తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కేటీఆర్ ఇక్కడ నాలుగు సార్లు వరుస విజయాలను నమోదు చేశారు. కేటీఆర్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుండగా కేకే మహేందర్ రెడ్డి మూడుసార్లు ఓటమితో నాలుగోసారి సానుభూతితో గట్టెక్కాలని చూస్తున్నారు ఇక బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి బీఎస్పీ అభ్యర్థి పిట్టల భూమేష్ స్వతంత్ర అభ్యర్థి లగ్గిశెట్టి శ్రీనివాస్ లు ఎవరికి వారు ప్రచారం జోరు పెంచారు.
కే తారక రామారావు (బీఆర్‌ఎస్‌)
కేటీఆర్ ది సిద్దిపేట జిల్లా చింతమడక విద్యార్హత ఎంబీఏ న్యూయార్క్ కేసిఆర్ వారసుడిగా సిరిసిల్లలో తొలిసారి 2009లో పోటీ చేసి సమీప ప్రత్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పై 171 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికల్లో మళ్లీ కేకే మహేందర్ రెడ్డి పై 67999 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ లో ఉండి నాస్కబ్ చైర్మన్గా పనిచేస్తున్న కొండూరి రవీందర్రావు పై 53004 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పై 80009 ఓట్ల మెజారిటీతో తారక రామారావు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు మున్సిపల్ మైనింగ్ చేనేత జౌళి శాఖ ఎన్నారై శాఖల మంత్రిగా ఉన్నారు ఐదవసారి తారక రామారావు సిరిసిల్ల బరిలో నిలిచారు.
కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్)
ముస్తాబాద్ మండలం నామాపూర్ వాసి హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి సిరిసిల్ల ప్రాంతంలో మహేందర్ రెడ్డి ఉన్నారు ఆయన ఉద్యమ సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ముఖ్య అనుచరుడుగా ఉండేవాడు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి సిరిసిల్లా టికెట్ కేకే మహేందర్ రెడ్డి కి వస్తుందని ఆశించిన సమయంలో ఆయనకు టికెట్ రాకపోవడం తో పాటు అప్పటి తెలంగాణ ఉద్యమ నేత కే చంద్రశేఖర రావు కుమారుడు గా పేరున్న ప్రస్తుత మంత్రి కే తారక రామారావు కు టికెట్ రావడంతో కేకే మహేందర్ రెడ్డి. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కల్వకుంట్ల తారక రామారావు పై పోటీ చేసి 171 ఓట్ల స్వల్ప తేడాతో మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు 2010లో రెండోసారి కేటీఆర్ పై మహేందర్ రెడ్డి పోటీ చేశారు. తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

2018 పోల్ గ్రాఫ్
– మొత్తం పోలైన ఓట్లు….218390
– కేటీఆర్( బి ఆర్ ఎస్) ఓట్లు….125213
– మహేందర్ రెడ్డి( కాంగ్రెస్) ఓట్లు…36204
– మెజారిటీ…89009

2023 ఓటు గ్రాఫ్
– మొత్తం ఓటర్లు…240798
– పురుషులు…117872
-స్త్రీలు….122920
– ఇతరులు…06
– పోలింగ్ కేంద్రాలు…287