
– చూపే ప్రేమ ఆదరణ వల్లే 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న…
– చేపల ఎగుమతిలో మనమే టాప్…
– రేడిమేట్ తో ఉపాధి కి పేద్ద దెబ్బ..
– ముదిరాజ్,ఎంబిసి కులాల ఆత్మీయ సమ్మేళనం..
నవతెలంగాణ డిచ్ పల్లి. మీరే నా బలం.. మీరే నా బలగం.. మీరందరూ చూపే ప్రేమ ఆదరణ వల్లే గత 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నానని, ఒకపక్క నక్సలైట్లు, ఇంకోపక్క ప్రతి పక్షాలు నాపై దాడులు ఉదృతం చేశాయని, ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు, కష్టాలు చాలా ఉన్నాయని, చేపల ఎగుమతిలో మనమే టాప్ లో నిలిచామని ఎమ్మెల్యే, రూరల్ బిఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి శివారులోని జి కన్వెన్షన్, ఎస్ ఎల్ జి ఫంక్షన్ హాల్ లలో ముదిరాజ్,ఎంబిసి కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ముదిరాజ్,ఇతర ఎంబిసి కులాల సంక్షేమానికి దాదాపు రూపాయలు 6 కోట్ల ల నిధులతో ముదిరాజ్, రజకులు , కుమ్మరి,ఓడ్డఎర,మేదరి,మేర కులాల సంక్షేమానికి కమ్యూనిటీ హాల్స్, పెద్దమ్మ తల్లి దేవాలయాలు, ప్రహరి గోడలు, నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.చేపల ఎగుమతిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని అన్నారు.ఏడ్చే మగవాన్ని అస్సలకే నమ్మవద్దని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కల్లబొల్లి మాటలు నమ్మవద్దని సూచించారు.సీఎం కేసీఆర్ ముదిరాజ్,ఎంబిసి కులస్థుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ ఉచితంగా చేపపిల్లలను, ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయడమే కాకుండా వారికి సబ్సిడీపై వాహనాలను అందించి ప్రోత్సహించినట్టు తెలిపారు. దీంతో తెలంగాణ చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి గురించి ఆలోచించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని కొనియాడారు. ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఓటు వేయాలంటూ వస్తున్నారని, వారు ఏం చేశారో నిలదీయాలని సూచించారు.ఆంతకుముందు
తెలంగాణ అమరవీరుడు ముదిరాజ్ పోలీస్ కిష్టయ్యకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.జిల్లలో ఒకే ఓక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడని ఎలాగైనా అ బీసీ ఎమ్మెల్యే లేకుండా చేయడానికి కొందరు పూనుకున్న రాని, ఈసారి నీయోజకవర్గ ప్రజలు గేలిపిస్తే ఐదవ సారి అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక మంచి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు.అర్టీసి చైర్మన్ పదవి ఇవ్వక ముందు అది నష్టాల్లో ఉండేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన అ భద్యతలను సంతోషం తో స్వికరించి నేడు ఆర్టీసీ లాభాల బాటలోకి తేవడం జరిగిందన్నారు. ఏభద్యత ఇచ్చిన దానికి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ వి. జి గంగాధర్ గౌడ్, లల్లు ముదిరాజ్ (గోల్డ్ మెన్), ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ , ముదిరాజ్ నాయకులు, మొచ్చ శ్రీనివాస్, సిరికొండ మండల అధ్యక్షులు శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ముదిరాజ్,ఇతర కులాల ముఖ్య నాయకులు, నరాల సుధాకర్, ఎంపిటిసి డీకోండ సరితా సుదిర్, జడ్పిటిసిలు, ఎంపీపీలు, మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.