కంటి చూపు ఉంటేనే ప్రపంచాన్ని చూడొచ్చు…

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎంపిటిసి చింతల దాస్, గ్రామ ప్రత్యేక అధికారి దీప్ చంద్, వైద్యురాలు వరలక్ష్మి, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ దర్పల్లి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి టీ శ్రీధర్ లతో కలిసి  ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎంపిటిసి చింతల దాస్, ఇతరులు మాట్లాడుతూ.. ఒక కంటి చూపుతో ప్రపంచాన్ని చూడవచ్చని దీనిపై ఎవరైనా ఉండాలని సూచించారు. ఈ కంటి వెలుగు శిబిరంలో 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహిస్తారని, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి కంటి పరీక్ష కోసం ఉచిత శిబిరానికి రప్పించే విధంగా చుడాలని, ఇప్పటికే గ్రామంలో మైకుల ద్వారా ప్రచారం చేశామని వివరించారు.శస్త్ర చికిత్స అనంతరం అవసరం ఉన్న వారికి మోతే బిందు కొరకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కంటి ఆపరేటర్ ఆర్ ప్రకాష్, డిఇఓ ఎం అనిల్,అసిఫ్, ఎఎన్ఎం లు అరుంధతి, భానుప్రియ, బిఅర్ఎస్ నాయకులు బిరిష్ శేట్టి, ప్రవీణ్ గౌడ్, చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న, క్రాంతి కుమార్, కరోబార్ నరేందర్, ఆశ కార్యకర్తలు పాశం జ్యోతి, బండ ప్రమీల,టీ సావిత్రి, స్వప్న ,ప్రియాంక తోపాటు తదితరులు పాల్గొన్నారు.