నవతెలంగాణ-చందుర్తి
మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రేణుక(25) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. గ్రామస్తుల కథన ప్రకారం నర్సింగాపూర్ గ్రామం చెందిన నేరెళ్ల హమ్మయ్య- పుష్ప దంపతుల కూతురు రేణుక గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ ఆఫీసులో పనిచేస్తుంది. గంగాధర్ లోని ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో గల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.