పట్టుదల ఉంటే యువత ఏదైనా సాధిస్తుంది

– రాష్ట్ర మినరల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ క్రిశాంక్‌
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
పట్టుదల ఉంటే యువత ఏదైనా సాధిస్తుందని తెలంగాణ మినరల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ క్రిశాంక్‌ అన్నారు యువతలో ఉత్సాహాన్ని పెంచేందుకు వారి సమస్యలు తెలుసుకునేందుకు 6వ వార్డ్‌ లోని గోల్డెన్‌ పాయింట్‌ కేఫ్‌లో మన్నె క్రిశాంక్‌ 5వ ”కేఫ్‌ పాలిటిక్స్‌” కార్యక్రమం నిర్వహిం చారు ఈ కార్యక్రమంలో యువత భారీ సంఖ్యలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన యువతకు ఉన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యో గాలు ఏ విధంగా పొందాలి పోటీ పరీక్షలు ఏ విధంగా రాయాలి అనే అంశాలను యువతకు చెప్పారు. యువత రాజకీయాల్లో ఏవిధంగా రావాలన్న విషయాన్ని కూడా చెప్పారు. సమస్యలపై ఏ విధంగా స్పందించాలి, యువత ప్రసంగాలు ఏ విధంగా చేయాలని వివరించారు. క్రిశాంక్‌ తెలిపిన అంశాలను యువత కూడా ఆసక్తిగా విన్నారు. కార్యక్రమంలో సంజరు, నవీన్‌, రఘు, కళ్యాణ్‌, హరీష్‌, ఉదరు తదితర యువకులు పాల్గొన్నారు..