వివిధ పార్టీల నుండి యువత కాంగ్రెస్ పార్టీలో చేరిక..

నవ తెలంగాణ:రెంజల్: మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో  బీజేపీ, బీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్ పార్టీల నుంచి యువత కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, ఇంచార్జ్ అంతి రెడ్డి రాజిరెడ్డి ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ కు రావడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు జి.సాయిరెడ్డి, ధనుంజయ్, సాయిబాబా గౌడ్, ఇందిరా దేవి, గంగా గౌడ్, లచ్చే వార్ నితిన్, వెంకట్ రెడ్డి, కే శ్రీనివాస్, కొండలవాడి శేఖర్, సగ్గు వెంకటి, ఆసాని వేణు, హైమద్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.