అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన యూత్ నాయకులు

 
నవతెలంగాణ -పెద్దవంగర: మండల పరిధిలోని పోచంపల్లి గ్రామంలో ముత్యాలమ్మ, మహంకాళమ్మ వార్లకు మంగళవారం గ్రామానికి చెందిన జర్నలిస్టు వంశీ ఆధ్వర్యంలో యూత్ నాయకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటీవల ఆలయంలో ప్రమాదవశాత్తు దీపం అంటుకుని అమ్మవారి చీర, విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో దాతలు రాష్ట అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ దేవగిరి రమేష్ శర్మ, పాలకుర్తి దేవస్థాన ధర్మకర్త కోడూరు నర్సింహారెడ్డి సహాకారంతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, గణపతి పూజ, ప్రాతఃకాల మండప పూజ, దుర్గాదేవి హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ఠ, కుంభం, ప్రాణ ప్రతిష్ఠ ఆశీర్వచనం నిర్వహించారు. కార్యక్రమంలో కోటగిరి ఉదయ్ కిరణ్, బొత్తల సాయి, సుధగాని మహేష్, బెల్లంకొండ అభినాష్, పులి ఆదర్శ్, బూడిద చరణ్, పబ్బతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.