బీఆర్ఎస్ పార్టీలో చేరిన సాటాపూర్ యువత…

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, పార్టీల నుంచి యువత బీఆర్ఎస్ లో చేరినట్లు సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు వికార్ భాషా తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గుండ్ల మధు, మీసాల గణేష్, మేదరి మధు, గుండ్ల రమేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, శ్రీకాంత్, కృష్ణ, గ్రామంలోని యువత పాల్గొన్నారు.