యువత మంచిమార్గాన్ని ఎన్నుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

– మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
యువత మంచి మార్గాన్ని ఎన్నుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకున్నపుడే మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి అన్నారు. షాద్‌నగర్‌ రెడ్డి భవనంలో రెడ్డి సేవ సమితి ఆధ్వర్యంలో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఐదు మంది యువతి యువకులు పోలీస్‌ ఎంపికలో ఎస్‌ఐలుగా ఎంపికైనా వారికి సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షాద్‌నగర్‌ మాజీ శాసనసభ్యులు చౌల్లపల్లి ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గాలను ఎంచుకొని అనుకున్న లక్ష్యాలను చేరుకున్నప్పుడే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందన్నారు. ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించిన ఎన్‌ నరేందర్‌రెడ్డి, పి.స్వాతి, జి.సంధ్యరాణి, టీ.చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, మంజులా రెడ్డి, మదన్‌ మోహన్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, మోహన్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, కష్ణ రెడ్డి, బాల్‌రెడ్డి, దామోదరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, కష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.