నవతెలంగాణ-భూపాలపల్లి
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలు సాధిం చాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్ల కరుణాకర్ అన్నారు. బుధవారం పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యూత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1000మంది యువ విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, నివారణ, ట్రాఫిక్ ఉల్లంఘన, షి టీం, ర్యాగింగ్, వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కరుణాకర్ హాజరై మాట్లా డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది యువతేనని, చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అన్నారు. ర్యాగింగ్ విష సంసక్కృతికి దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత తగిన అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు, యువత తమ వ్యక్తిగత వివరాలు, అపరిచితులతో పంచుకోవద్దని అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే పోలీసులను ఆశ్రయించాలని, 1930 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని అన్నారు. యువత ట్రాఫిక్ నియమనిబంధనలు పా టించాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాల సమా చారం తెలిస్తే పోలీసులకు అందించాలన్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీం విభాగం సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలకు చావు పరిష్కారం కాదని అఆన్నరు. సమస్యలు ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని, బాధ్యతగా ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు, భూపాలపల్లి డీఎస్పీ ఏ రాములు, కాటారం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
పోలిసుల పాత్ర కీలకం
ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఇందులో పోలీస్ల పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎస్పీ పుల్ల కరుణాకర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. పోలీసులు ఎన్నికల సంఘం నియం త్రణలో, పర్యవేక్షణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని అన్నారు. పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధి పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచిం చారు. గ్రామాలలో సమస్యలు సృష్టించే వారిని బైం డోవర్ చేయాలని అన్నారు. సమస్యాత్మక గ్రామా లను, మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లి డీఎస్పీ ఏ రాములు, కాటారం డీఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.