నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక ఎన్నికల ఫలితాలు మతరాజకీయాలకు చెంప పెట్టులాంటివని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో కూడా కుట్ర రాజకీ యాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తమ స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పులే వెలువడుతాయని గుర్తుచేశారు. కులం, మతం, డబ్బు, అధికారమదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని పేర్కొన్నారు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నదని తెలిపారు.