రాయల్ ఇన్ ఫీల్డ్ పై అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జడ్పీ చైర్మన్

నవతెలంగాణ-మంథని
మంథని పట్టణ ప్రజలకు ఆహ్లదం పంచేలా అభివృధ్ది పనులు జరుగుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. సోమవారం మంథని సుందరీకరణలో బాగంగా పట్ణణంలో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన పరిశీలిస్తూ బుల్లెట్‌(ఇన్ ఫీల్డ్)బండిపై విస్తృత పర్యటన చేపట్టారు.మున్సిపల్‌ పరిధిలోని రావులచెరువుకట్ట, తమ్మిచెరువుకట్ట,బొక్కలవాగుకట్ట సుందరీకరణలో బాగంగా జరుగుతున్న సీసీరోడ్డు,వాకింగ్‌ ట్రాక్‌,లైటింగ్‌ పనులతో పాటు రజకవాడ నుంచి రావులచెరువుకట్ట ప్రాంతంలోని శివకిరణ్‌ గార్డెన్‌ వరకు రహాదారి నిర్మాణం కోసం ఆయన పరిశీలన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మంథని మున్సిపాలిటిని అభివృద్ది చేసి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.పట్టణానికి చెందిన వారు ఎంతో మంది ఇతర ప్రాంతాల్లో ఉంటారని,అలాంటి వారు మంథనికి వస్తే మంచి ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. మంథనిని మరో కోనసీమ తరహాలో అభివృధ్ది చేయాలనే ఆకాంక్షతో ఉన్నామని,ఈ క్రమంలో అనేక అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు.త్వరలోనే మంథని ముఖచిత్రంలోనే మార్పు కన్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్,వీకే రవి,కాయితి సమ్మయ్య, వేముల లక్ష్మీ సమ్మయ్య,నక్క నాగేంద్ర శంకర్,కొట్టే పద్మ రమేష్,నాయకులు ఏగోలపు శంకర్ గౌడ్,నీలం రమేష్, రాకేష్,ఎమ్మెస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.