హైమాస్ట్ లైట్ల ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని సాంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ నీదులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ల ను ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు సర్పంచ్ మోహన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో తెలంగాణ ఉద్యమానికి సాంపల్లి గ్రామం సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, గ్రామంలో ఐక్యత గా ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హైమాస్ట్ లైట్ల ను మంజూరు మంజూరు చేయటం జరిగిందన్నారు.గ్రామంలో త్వరలోనే 2 లక్షల రూపాయలు సీసీ డ్రైనేజీ నిర్మాణం కు మంజూరు చేస్తానని హామీ నిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, ఉపసర్పంచ్ మోహన్, సాంపల్లి తండా సర్పంచ్ జగదీష్, గ్రామ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు