– ఆర్థికసాయం అందజేత
నవతెలంగాణ-ములుగు
జంగాలపల్లి గ్రామంలో బుధవారం మతి చెందిన నాగెల్లి బుచ్చమ్మ మత దేహానికి పూల మాల వేసి జడ్పీ చైర్మన్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యు లకు రూ.3 వేలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన చింతల నిర్మళ, పెండల రాజనర్సు, ముసినపల్లి రవి కుటుంబాలను పరామ ర్శించి పెండాల రాజనర్సు కుటుంబానికి రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందించారు. మతుల చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించిన ఆమె వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మస్రగాని.వినరు కుమార్,చిట్టి బాబు,గణపతి, ఇంచర్ల పిఏసిఎస్ ఛైర్మెన్ రాములు, ముడతన పెళ్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.