ఉమర్ కుటుంబానికి జడ్పిటిసి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన ఎండి ఉమర్ కుటుంబానికి జడ్పిటిసి తుమ్మల హరిబాబు సోమవారం పరామర్శించి 4000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఉమర్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంది ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కీర్తి రవి, చల్లా శ్రీను, మునిగాల వెంకన్న, ఎండి ఫక్రుద్దీన్, తుమ్మల శివ, ప్రకాష్ రెడ్డి, కనకయ్య, గూడూరు శ్రీనివాసరావు, భగవాన్ రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.