నవతెలంగాణ మద్నూర్ : డోంగ్లి మండలంలోని మోగా గ్రామానికి చెందిన సురేఖ అంజా గౌడ్ దంపతుల కుమారుడైన సతీష్ గౌడ్ అగ్ని పద్ ద్వారా ఆర్మీ జవాన్ గా ఎంపికై ట్రైనింగు ముగించుకొని సొంత గ్రామమైన మొగ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ జెడ్పిటిసి కుటుంబ సభ్యులు కథలయ్య ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జెడ్పిటిసి సభ్యులు మాట్లాడుతూ ఆర్మీ జవాన్ గ్రామం నుండి ఎంపిక కావడం దేశ ప్రజల రక్షణలో మోగా గ్రామ యువకుడు సతీష్ గౌడ్ విధుల్లో చేరడం అభినందనీయమని వారు పేర్కొన్నారు ఆ యువకునికి గ్రామ ప్రజలంతా అభినందించారు