అనర్థాలను అరికట్టడంలో కనిపించని భారతీయత

మొన్న దేశ ప్రధాని మోడీ బెంగుళూరులో మాట్లాడుతూ రక్షణ విమాన రంగంలో దేశం స్వాలంబన దిశగా ఉందని అన్నారు. దిగుమతుల స్థాయి నుండి ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని సెలవిచ్చారు. ఫిబ్రవరి 14 వాలంటైన్‌ డే అని, ఇది ప్రాశ్చాత్య దేశాలు ఆచరిస్తున్న సంస్కృతి దీనికి భిన్నంగా కౌ హగ్‌ డే నిర్వహించాలని సర్క్యులర్‌ జారీ చేసి విమర్శలు రావడంతో తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది. వాస్తవానికి దేశం అగ్రగామిగా ఉన్నది నిరుద్యోగం, పేదరికం, నీచత్వం, దారిద్య్రం, జీవన ప్రమాణాలు దిగజారడం, అనారోగ్యం, అవిద్య, దివాళాకోరుతనం, అజ్ఞానం, కాలుష్యం, అభద్రతా భావం, ఆహార కల్తీ, విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవడంలో, మేధో వలసలు ఎక్కువగా ఉన్న సంగతి ప్రపంచానికి మనం చెప్పక్కర్లేదు. అధిక ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి నిరుద్యోగం, ప్రజాస్వామ్యం అణచివేత విద్వేష రాజకీయాలు రూపాయి విలువ భారీగా పతనం కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ సమాజంలో విభజన దేశ భద్రతలో వైఫల్యం ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సహనం లేకుండా పోవడం ఈ నవ వసంతాలలో ఎక్కువగా ఉన్న సంగతి ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రతి అడ్డమైన పనికి దేశభక్తి, దేశ సంస్కృతి ముడిపెట్టి ప్రచార ఆర్భాటాలకు పరిమితమైన ప్రభుత్వాన్ని చూస్తున్నాం. సంవత్సరానికి తృణధాన్య సంవత్సరంగా నామకరణం చేశారు. తృణధాన్యాలు పండించే రైతుకు ప్రోత్సాహకం లేకుండా చేసి వినియోగ పంటల నుండి వాణిజ్య పంటలకు మారే దుస్థితి వచ్చింది. దేశ రాజధానిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 500 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరాలు ఏవైనా ఉన్నవా అంటే దీనికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యూపీ, హర్యానా పంజాబ్‌ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వలన అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దేశ సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తగ్గిపోతున్నది. మితిమీరిన క్రిమిసంహారక మందులు వాడటం వలన భూములు నిస్సారం అవుతున్నాయి. భూసారం గురించి మంచి వ్యవసాయ పద్ధతులు పాటించే వారు కరువయ్యారు. కలుపు నివారణకు బ్యాన్‌ చేసిన గ్లైసిల్‌, పెండ మీథేన్‌, స్టాంప్‌ లాంటి భయంకర రసాయనాలు వాడటం జరుగుతున్నది. ప్రజల ఆరోగ్య అలవాట్లలో మార్పు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది’- వాటిలో ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి. ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు అధికోత్పత్తిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ సమతుల ఆహా రం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లు. పోషకాహర లోపం లోపిస్తే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి.
దేశంలో పౌష్టికాహార సమస్య
పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు మోడీ. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటలా తిండిలేక దీనస్థితిలో కడుపేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకొల్లలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం సమస్య ఉంది. కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువుకంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు 40శాతం ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగంవరకూ శిశుమరణాలు పౌష్టికాహార లోపంవల్లే సంభవిస్తున్నాయి. మహిళల్లో కూడా పౌష్టికాహార లోపం సమస్య తీవ్రంగా ఉండి, 56శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు తెలియ జేశాయి. దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, ఎక్కువగా ఉన్న కుటుంబాల పిల్లల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి.
రాజకీయ లబ్దితోనే ఆర్థిక సంక్షోభం
ప్రపంచ ఆకలి సూచికలో 129వ స్థానం, ఆర్థిక సూచికలో 108వ స్థానం, మానవ అభివృద్ధి సూచికలో, సంతోష సూచిక, ఆరోగ్య సూచిక ఎప్పుడూ వంద స్థానానికి తక్కువ లేకుండా చేసుకుంటున్నాం. రూపాయి విలువ దిగజారలేదని డాలర్‌ విలువ పటిష్టమైందని ఆర్థిక మంత్రి సెలవిస్తారు. ఆర్థిక సంక్షోభం అంటే కొన్ని ద్రవ్యపరమైన ఆస్తులు ఉన్నట్టుండి తమ నామమాత్ర మూల్యాన్ని కోల్పోయే విస్తృతమైన పరిస్థితి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలి పోవడం, ఆర్థిక బుడగలు పేలిపోవడం, ద్రవ్య (కరెన్సీ) సంక్షోభం, ప్రభుత్వం తాము చేసిన అప్పులు చెల్లించకపోవడం మొదలైనవి ఆర్థిక సంక్షోభం కిందికి వస్తాయి. చాలామంది ఆర్థికవేత్తలు ఆర్థిక సంక్షోభాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని ఎలా నివారించాల నేందుకు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాటి శాస్త్రీయత మీద ఆర్థికవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. అప్పుడప్పుడు ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత దీన స్థితిలో నెట్టాయి. రాజకీయ లబ్దే ప్రధానంగా జాతీయ ప్రయోజనాలను మరుగుపడిన చోట ఇలాంటి ఉత్పాతాలే మిగులుతాయి. పాఠం నేర్పకపోతే ఏ దేశమైనా మునగక తప్పదు. మన దేశంలో ఆర్థికవృద్ధి అంచనాలు గత రెండు సంవత్సరాలుగా పేలవంగా ఉన్నాయి. ఉద్యోగాలు సృష్టించటమనేది ప్రభుత్వానికి ఎదురయ్యే అతి పెద్ద అవరోధంగా ఉంటుంది. జనాభా రీత్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారతదేశం తన యువ కార్మిక శక్తిని ఇముడ్చు కోవాలంటే ఏటా 1.20కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. అయితే 2016 నవంబర్‌లో చేసిన పెద్దనోట్ల రద్దు దెబ్బకు కుదేలైన చిన్న వ్యాపారాలపై జీఎస్‌టీ అమలుతో మరోసారి గట్టి దెబ్బతిన్నాయి. వాటిలో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో వ్యవసాయం, నిర్మాణ రంగం, చిన్న పరిశ్రమలు అతిపెద్ద ఉద్యోగ రంగాలు. ఎందుకంటే కార్మికశక్తి ఎక్కువ అవసరమైన రంగాలవి. కానీ ఈ మూడు రంగాలూ ఇటీవలి సంవత్సరాల్లో ఉద్యోగాలు సృష్టించలేక పోతున్నాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చాక వృత్తిదారుల బతుకులు ఉన్నత స్థితికి చేరాల్సిందిపోయి, నీచ స్థితికి చేరడం మొదలయింది. కాదేదీ కల్తీకి అనర్హం. దేశంలో రోజు రోజుకూ ఆహార కల్తీ ఎక్కువ అయిపోయింది. ఏది కొనాలి అన్నా, తినాలి అన్నా భయపడే రోజులు వచ్చాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపో తున్నాయి. డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి. టీ, కాఫీ, పాలు, తేనె, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూ ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామ మాత్రపు సొమ్మునైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై న్యాయ స్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా, అధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే అవుతున్నాయి. ఈ అనర్థాలను అరికట్టినప్పుడే దేశం ఆరోగ్య సమాజంగా నిలబడుతుంది.
– డాక్టర్‌ యం. సురేష్‌బాబు

Spread the love
Latest updates news (2024-04-19 10:43):

low blood 13p pressure high blood sugar | gabapentin gnL and blood sugar levels | older 2Qy adults blood sugar levels | blood sugar WgO monitoring smartwatch | blood and sugar book xdn review | what does a iwv normal person blood sugar graph look like | how growth hormone effects blood xCq sugar | do calories without glucosr bring up my blood sugar r2a | E12 blood sugar should be | can low dtz blood sugar trigger a seizure | blood sugar DCa a1c ratio | can stress make my blood sugar go up past f8w 200 | fasting blood 4De sugar 114 means | low blood sugar 1hx fingers numb | way Idn to test blood sugar at home | SqO blood sugar tests near me | 3 day to lower 3No blood sugar | pjy blood sugar 300 what to do | i9G dogs can sense low blood sugar | blood sugar level 3 hours 7o5 after eating for diabetics | how long to lower blood sugar with diet and AFH exercise | is a blood sugar spike similar to an insulin spike UnA | foods RQ1 to help control blood sugar levels | living with high blood sugar diabetes hKF | does cholesterol medication bkD increase blood sugar | blood anxiety sugar fertility | high DrY blood sugar cause vomiting | does low iOQ blood sugar cause you to be naseaus | v3a how to keep blood sugar from dropping too low | how do V9S you lower blood sugar levels | 9aU what can i do to bring blood sugar down | qQe low blood sugar levels signs | sugar reduces white blood cells ep5 | is 69 a good blood sugar sAa level | can i FiD have low blood sugar without being hypoglycemic | 09V how do blood sugar monitor patches work | can vapes raise blood b3M sugar | blood sugar levels and water 6n3 | juice to Mnc reduce blood sugar | esi steroid make Thw blood sugar high | 2bM stress raises blood sugar | how OYP long does a fasting blood sugar test take | what are symptoms of sQS blood sugar dropping | how low should QeI blood sugar be | after meal blood sugar levels in 8NC normal | signs y3N of high blood sugar in adults | 63 blood 9EJ sugar pregnancy | QOB snaps blood sugar health reviews | diabetes blood sugar PrH tracking log | blood 098 sugar level char