అళ్ళెం సమ్మయ్య భౌతికాయనికి నివాళులర్పించినా బీఆర్ఎస్‌ నాయకులు

నవతెలంగాణ – కన్నాయిగూడెం
అలెం సమ్మయ్య భౌతికాయాన్నికి పూల మాల వేసి నివ్వాలి అర్పించి, శ్రద్ధాంజలి ఘటించి, వారీ కుమారులను పరామర్శించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, ముఖ్య నాయకులు. ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్ అల్లేం ప్రభాకర్  తండ్రి అల్లేం సమ్మయ్య అనారోగ్యంతో  MGM హాస్పటల్ లో మరణించగా ఈ రోజు ఉదయం స్థానిక నాయకులు సమాచారం మేరకు కన్నాయి గూడెం గ్రామానికీ వెళ్ళి స్థానిక నాయకులతో కలిసి సమ్మయ్య ఇంటికి వెళ్ళి అయన భౌతికాయాన్నికి పూల మాల వేసి నివ్వాలి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం సమ్మయ్య భార్య చెంద్రమ్మ మరియు కుమారులు ప్రభాకర్, నాగరాజు, నర్సింహయ్య మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సమ్మయ్య మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు వారీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.ఆల్లెం సమ్మయ్య భౌతికాయాన్నికి నివాళి అర్పించిన వారిలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ తో పాటు జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,మండల ప్రధాన పూజారి సత్య నారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు వాసం పెళ్లి రాం బాబు, మండల రైతు సమన్వయ కమిటీ తడుక మధుకర్, బోగ్గం బాబు, కుర్సం బాబు, లక్ష్మయ్య, తోల్లెం రామారావు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love