గాంధీకి ఘన నివాళి

నవతెలంగాణ – చిన్నకోడూరు
గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనీ, ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని సిద్దిపేట జిల్లా రైతుబంధు సమితి సభ్యులు మేడికాయల వెంకటేశం అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామ పంచాయితి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మండల నాయకులు నరసింహరెడ్డి, వెంకటరెడ్డి, బాలయ్య, పోచయ్య, కనకరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.