నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కె.వివేకానంద అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్‌ పరిధిలోని సన్మాన్‌ బెల్మోర్‌ విల్లాస్‌లో రూ.28 లక్షలతో నూతన ంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. తమ సమస్యను తీర్చి నందుకు హర్షం వ్య క్తం చే స్తూ… ఘ నంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవ ర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జనాభా పెరుగుదలను దష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు రామ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, కోశాధికారి జితేంద్రనాథ్‌, కిషోర్‌, సురేష్‌, శ్రీకాంత్‌, కమల్‌, వార్డ్‌ సభ్యులు ఇంద్రారెడ్డి, సుధాకర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కుంట సిద్ధిరాములు, కాలే నాగేష్‌, గణేష్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.