మద్యం మత్తులో డ్రైవర్‌.. కారు బీభత్సం

– పారిశుధ్య కార్మికురాలికి గాయాలు
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌.. పారిశుధ్య కార్మికురాలిని ఢకొీట్టాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన అనసూయ జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఇంద్రానగర్‌లో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం రహదారులను శుభ్రం చేస్తున్న ఆమెను కారు ఢకొీట్టింది. ఆమె కాలికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించినట్టు తేలడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.