మహానందిలో ముగిసిన సీరియల్‌ చిత్రీకరణ

మన ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న గంగ్రోతి టెలి సీరియల్‌ చిత్రీకరణ శుక్రవారం మహానందిలో ముగిసింది.

మహానంది, నవంబరు 18: మన ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న గంగ్రోతి టెలి సీరియల్‌ చిత్రీకరణ శుక్రవారం మహానందిలో ముగిసింది. హీరోయిన్‌ మౌనికపై క్షేత్ర పరిసరాల్లో నాలుగు రోజుల పాటు వివిధ సన్నివేశాలను చిత్రీకరించినట్లు దర్శకుడు కోలా నాగేశ్వరరావు తెలిపారు. చివరిరోజు ఆలయం పరిసరాల్లో పలు కీలక సన్నివేశాలను తీసినట్లు చెప్పారు.