మూడు నిర్మాణ సంస్థలు నల్లడబ్బును పోగు చేశాయి

– తమ దాడుల్లో తేల్చిన ఐటీ అధికారులు ?
– ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి నివాసంతో పాటు మరో రెండు నిర్మాణ సంస్థల్లో ముగిసిన ఐటీ సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో గత ఆరు రోజులుగా ప్రముఖ నిర్మాణ సంస్థలపై కొనసాగిన ఐటీ దాడులు సోమవారం ముగిశాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కి చెందిన రాజ్‌ పుష్ప బిల్డర్స్‌తో పాటు ముప్పా, వర్టెక్స్‌ బిల్డర్స్‌పైనా గత ఆరు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల వ్యయంతో ఈ సంస్థలు విల్లాలను నిర్మించడంతో పాటు అనేక నూతన భవనాలు, ఇండ్లను కూడా నిర్మించినట్టు ఐటీ సోదాలలో వెల్డఐనట్టు తెలిసింది. ముఖ్యంగా తాము నిర్మించిన విల్లాలు, ఇండ్లను వికయ్రించే సమయంలో కొన్న వారి నుంచి భారీ మొత్తంలో నల్లధనాన్ని కూడా ఈ బిల్డర్లు సేకరించిన విషయం ఐటీ దాడుల్లో వెలుగు చూసినట్టు తెలిసింది. ముఖ్యంగా తమ నిర్మాణాలను విక్రయించడం ద్వారా పొందిన కోట్లాది రూపాయల లాభాలను నల్లధనంతో పాటు వేరే వ్యాపారాలలో పెట్టుబడులను పెట్టినట్టుగా సమాచారం. గత ఆరు రోజులుగా ఈ సంస్థల ఎండీలు, సీఈఓలు, ఇతర డైరెక్టర్లు, ఇతర అక్కౌంటెంట్ల ఇండ్లలోను ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అలాగే గత ఆరు రోజులుగా ఎమెల్సీ వెంకట్రామరెడ్డి నివాసంలో వరుసబెట్టి సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లను ఐటీ అధికారులు స్వాధీనపర్చుకున్నారని తెలిసింది.